
రేపు మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లోగో ఆవిష్కరణ
విజయవాడ(గాంధీనగర్) : ఆల్‌మైనార్టీ సెంట్రల్ అండ్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లోగో ఆవిష్కరణ సోమవారం నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికై మైనార్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైనార్టీ కమిషన్ చైర్మన్ జనాబ్ అబిద్ రసూల్ ఖాన్ హాజరవుతారని తెలిపారు. ఆయనతోపాటు ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ ఉప్పులేటి దేవీప్రసాద్, కస్టమ్స్ కమిషనర్ ఖాదర్ రహమాన్ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీం, నగరశాఖ అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్ యాకూబ్ సాహెబ్, ఖాసీం సాహెబ్ పాల్గొన్నారు.