
బెంగళూరు: పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగుల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అవి మూకుమ్మడి ఫిరాయింపులకు దోహదం చేస్తున్నాయన్నారు. చట్టంలో సవరణలు తేవాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ మారదలిచిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలన్నారు. ఫిరాయింపుల కేసులపై నిర్ణయాన్ని స్పీకర్లు, చైర్‌పర్సన్లు, న్యాయమూర్తులు జాప్యం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం వెలువరించేందుకు కాలపరిమితి ఉండాలన్నారు. స్థానిక సంస్థలను బలో పేతం చేయాల్సిన అవసరముందన్నారు.
మీడియా పాత్ర కీలకం
దేశంలోని పెనుమార్పుల్లో మీడియా పాత్ర నిర్ణయాత్మకమని వెంకయ్య అన్నారు. కనిపించని వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. తన పదవీకాలం మూడు నెలల్లో ముగుస్తుందని, మళ్లీ రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఖాళీగా మాత్రం ఉండనని, ఏదో వ్యాపకాన్ని చేపడతానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment