ఆడపిల్లలను రక్షించుకుందాం | save girl child said padma devender reddy | Sakshi
Sakshi News home page

ఆడపిల్లలను రక్షించుకుందాం

Published Fri, Oct 7 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

ఆడపిల్లలను రక్షించుకుందాం

ఆడపిల్లలను రక్షించుకుందాం

సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. బతుకమ్మ స్ఫూర్తితో ఆడపిల్లలను రక్షించుకోవాలన్నారు. ప్రెస్‌క్లబ్‌లో బతుకమ్మ పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌లో శుక్రవారం తొలిసారిగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌( ఆడపిల్లలను రక్షిద్దాం) అనే సామాజిక అంశంతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు భావితరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మకు పూజలు చేసి, ఆడిపాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి, ఈటల జమున, సుశీల కోదండరామ్, శోభ, వెంకట్‌ మంతెన, భీమ్‌ రెడ్డి, గాయనీ మధుప్రియ, ప్రెస్‌క్లబ్‌ సెక్రటరీ శ్రీగిరి విజయ్‌కుమార్‌ రెడ్డి, ఈసీ మెంబర్స్‌ సరస్వతి రమ, యశోద, కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement