29న కర్నూలులో మాదిగల ‘సింహగర్జన’ | simha garjana on 29th of this month | Sakshi
Sakshi News home page

29న కర్నూలులో మాదిగల ‘సింహగర్జన’

Published Thu, Nov 10 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

29న కర్నూలులో మాదిగల ‘సింహగర్జన’

29న కర్నూలులో మాదిగల ‘సింహగర్జన’

విజయవాడ (గాంధీనగర్‌) : ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈనెల 29న కర్నూలులో మాదిగల సింహగర్జన మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుందన్న మందాకృష్ణ మాటల్లో నిజం లేదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కృష్ణమాదిగ కుమ్మక్కై మాదిగలను బీజేపీ వైపు మళ్లించేందుకు చేస్తున్న కుట్ర అన్నారు. వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం  చేయాలన్నారు. కర్నూలు సభ ద్వారా కేంద్రంపై తాము ఒత్తిడి పెంచుతామని చెప్పారు. అనంతరం సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ మహిళా అధ్యక్షురాలు నల్లూరి చంద్రలీల, మందా నాగమల్లేశ్వరరావు, ఆరేటి ఏసుపాదం, పాల్వాయి దాసు పాల్గొన్నారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement