VENKATESWARARAO
-
దిగంబరుడినవుతా!
విశాఖపట్టణంలో ఒక సాహిత్య సభ జరిగింది. ఆరోజు శ్రీశ్రీ కాస్త నలతగా ఉన్నారు. కట్టుకున్న పంచె కొంచెం పట్టు సడలింది. అందుకని కూర్చునే ఉపన్యాసం ప్రారంభించారు. ‘‘నిలబడి మాట్లాడాలి’’ అంటూ సభలో కొందరు కేకలేశారు. అప్పుడు శ్రీశ్రీ– ‘‘నేను నిలబడితే దిగంబరుడినవుతా, అదీ నా భయం’’ అన్నారు. వేదిక మీద ఆయన వెనుకనే దిగంబర కవులు కూర్చొని ఉన్నారు. అందుకనే శ్రీశ్రీ ఆ ఛలోక్తి విసిరారు. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు -
ట్రాక్టర్ బోల్తా.. తండ్రీకొడుకుల మృతి
పెదవేగి: కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని ముడిచర్ల గ్రామానికి చెందిన పామర్తి వెంకటేశ్వరరావు(72) కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 30 మందితో కలిసి పెదవేగి మండలంలోని రాట్నాలమ్మ తల్లి దర్శనానికి ట్రాక్టర్లో బయలుదేరారు. గ్రామ శివారులోకి రాగానే వర్షం వస్తుండటంతో.. ట్రాక్టర్ తోట్టిలో ఉన్నవారు త్వరగా వెళ్లమని డ్రైవర్ పై ఒత్తిడి తేచ్చారు. దీంతో వేగం పెంచి ముందుకు పోనిస్తుండగా.. రోడ్డు తడిసి ఉండటంతో పాటు ప్రమాదకర మలుపు రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సత్యనారాయణ(31) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
సస్పెన్షన్‌కు గురైన ఈఓ ఆత్మహత్య
మనస్తాపం చెంది ఎలకల మందు తాగిన వైనం భర్త మృతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు రాజానగరం/కోరుకొండ/అనపర్తి : దేవాలయ సొమ్ములు దుర్వినియోగం చేశారనే అభియోగంపై సస్పెండైన బొల్లెంపల్లి వెంకటేశ్వర్రావు (56) ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తుండగా బుధవారం రాత్రి 1.45 గంటల సమయంలో మృతి చెందినట్టు రాజానగరం పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం, కొంతమూరులో నివాసం ఉంటున్న తల్లిదండ్రులను చూసేందుకు వచ్చిన వెంకటేశ్వర్రావు గత నెల 30న బయటకని వెళ్లి కొద్దిసేపటికి తిరిగి వచ్చి వాంతులు చేసుకున్నారు. అదేమని ప్రశ్నించిన తల్లిదండ్రులకు, భార్యకు తాను ఎలుకల మందు తాగినట్టు తెలిపారు. దీనితో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోరుకొండ మండలం, నర్సాపురానికి చెందిన ఆయన అనపర్తిలో కాపురం ఉంటూ, బలభద్రపురం ఊళ్లపల్లి గ్రూప్ ఏరియాకు దేవదాయశాఖ ఈఓ (గ్రేడ్–2) గా పనిచేస్తున్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడలోని వేణుగోపాల, రామలింగేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో రూ. 33 లక్షలు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై మానసికవేదనతో ఉన్న అతనిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. అలాగే అతని స్థానంలో వేరొక ఈఓను ఇ¯ŒSచార్‌్జగా నియమించడంతో వెంకటేశ్వర్రావు మనస్తాపానికి గురై ఆత్మహత్య నిర్ణయానికి వచ్చి చివరి చూపుగా తల్లిదండ్రులను చూడాలని కొంతమూరు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తన భర్తపై లేనిపోని నిందమోపడంతోనే ఇలాజరిగిందంటూ అతని భార్య శుభలక్ష్మి భోరున విలపించారు. ఇదేవిషయమై దేవాదాయ శాఖ కమిషనరు, జిల్లా డిప్యూటీ కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమకు ఆసరా ఉంటాడనుకున్న కొడుకు ఇలా మృతి చెందడాన్ని అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసును రాజానగరం హెచ్‌సీ సాయిసుబ్రహ్మణ్యం దర్యాప్తు చేస్తున్నారు. నర్సాపురంలో అంత్యక్రియలు పోస్టుమార్టమ్ అనంతరం వెంకటేశ్వర్రావు మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించడంతో ఆయన స్వగ్రామైన కోరుకొండ, నర్సాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పి. విశ్వనాథ్‌రాజు, నరసింహంబాబు, పల్లం రాజు, బొక్కా వెంకటేశ్వరరావు తదితరులు బాధిత కుటుంబ సభ్యులను కలుసుకుని తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. -
29న కర్నూలులో మాదిగల ‘సింహగర్జన’
విజయవాడ (గాంధీనగర్) : ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈనెల 29న కర్నూలులో మాదిగల సింహగర్జన మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుందన్న మందాకృష్ణ మాటల్లో నిజం లేదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కృష్ణమాదిగ కుమ్మక్కై మాదిగలను బీజేపీ వైపు మళ్లించేందుకు చేస్తున్న కుట్ర అన్నారు. వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. కర్నూలు సభ ద్వారా కేంద్రంపై తాము ఒత్తిడి పెంచుతామని చెప్పారు. అనంతరం సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు నల్లూరి చంద్రలీల, మందా నాగమల్లేశ్వరరావు, ఆరేటి ఏసుపాదం, పాల్వాయి దాసు పాల్గొన్నారు. -
న్యాయవాది ఆత్మహత్య
తిరువూరు : తిరువూరుకు చెందిన సీనియర్ న్యాయవాది కొత్తా వెంకటేశ్వరరావు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలో ఉరి వేసుకుని వెంకటేశ్వరరావు మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. తన ఆత్మహత్యకు గల కారణాలను వెంకటేశ్వరరావు సవివరంగా సూసైడ్ నోట్లో రాసినట్లు తెలిసింది. గతంలో కూడా పలుమార్లు ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్ఐ సురేష్ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నా చావుకు పెద్దమనుషులే కారణం ‘నన్ను నమ్మించి అప్పు తీసుకున్న పెద్దమనుషులు మోసం చేశారు. అవసరానికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేసి తీరా పంచాయతీ చేసి పావలా ఇప్పిస్తాం, అర్ధ రూపాయి ఇప్పిస్తామంటూ బేరసారాలు చేసిన పెద్దలు చివరికి చేతులెత్తేశారు. ఏమి చేయాలో పాలుపోక, సమాజంలో తలెత్తుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నా’నని న్యాయవాది కొత్తా వెంకటేశ్వరరావు సూసైడ్నోటులో స్పష్టం చేశారు. ఆయన రాసిన సూసైడ్‌నోటును పోలీసులు, న్యాయవాదులు పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అధికార పార్టీకి చెందిన తిరువూరు నియోజకవర్గ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ తాను ఆ పార్టీకి 20 ఏళ్ల పాటు నమ్మినబంటుగా ఉన్నానని, అయినా నన్నే మోసం చేశారని వెంకటేశ్వరరావు ఆవేదనతో సూసైడ్నోటులో పేర్కొన్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఒకరు రూ.26 లక్షలు ఇవ్వాలని, సమీప బంధువు రూ.12 లక్షలు ఇవ్వాలని, ఈ సొమ్మును పెద్దలు తన మరణానంతరమైనా వసూలు చేసి తన భార్యకు ఇప్పించాలని కోరారు. తన మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని సూసైడ్నోటులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి సంతాపం వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి సందర్శించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దామోదరరావు, అదనపు జడ్జి పఠాన్ షియాజ్‌ఖాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగళ్ల మోహనరెడ్డి, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాలకు చెందిన కక్షిదారులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పగ్గాలు రాగానే పాగాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : బడి, గుడి, లెబ్రరీ, మార్కెట్, కమ్యూనిటీహాలు.. కబ్జాకు అనర్హమైన దేదీ లేదంటున్నారు కాకినాడలో టీడీపీ నేతలు. ఇందుకు నిదర్శనంగా కబ్జా బాగోతమొకటి పర్లోపేటలో వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’ పరిశీలనలో తేలిన వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరుడు, మాజీ కౌన్సిలర్ వి.పవన్‌మూర్తి పర్లోపేటలో మార్కెట్‌కు ఆనుకుని 122/98 సర్వే నంబరులోని సుమారు 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ ప్రహారీ కట్టేశారు. ఆ స్థలం వదిన వి.సీతారత్నంకు చెందిందని గోడ మీద రాయిం చారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలో మారుమూల జాగా అయినా గజం రూ.10 వేల పైమాటే. ఆ ప్రకారం చూసినా పవన్‌మూర్తి ఆక్రమించిన స్థలం విలువ రూ.40లక్షలు. పవన్‌మూర్తి ఆ స్థలానికి ఆనుకుని మత్స్యకారులకు మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన కమ్యూనిటీహాల్ గుమ్మాలకు గోడలు కట్టించి, తన ఆధీనంలో ఉంచుకున్నారు. చిన్నారుల సదుపాయానికి సంకెళ్లు కబ్జా చేసిన స్థలానికి సమీపంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులంతా కమ్యూనిటీ హాలు లోపలి నుంచి వెళ్లేందుకు దారి ఉండేది. విద్యార్థులు కమ్యూనిటీహాలు ఖాళీ స్థలంలో సాయంత్రం ఆడుకునే వారు. వారికి అదే కమ్యూనిటీహాలులో మధ్యాహ్నభోజనంవడ్డించేవారు. కమ్యూనిటీ హాలును కబ్జా చేసే క్ర మంలో హాలుకు, స్కూలుకు మధ్య గోడ నిర్మించేశారు. పాఠశాలకు డ్రెయిన్ మీదుగా చిన్నదారి ఏర్పాటు చేశారు. చివరకు పాఠశాల వైపున్న కమ్యూనిటీ హాలు గుమ్మాలకు సగం వరకు సిమెంట్ గోడలు కట్టించి, చిన్నారులను కట్టడి చేశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలలో గాంధీజీ విగ్రహాన్ని కూడా మార్చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘దేశం’ గెలిచాకే ఈ దందా.. స్థానిక మత్స్యకారుల కుటుంబాల్లో జరిగే కార్యక్రమాల కోసం వినియోగించే కమ్యూనిటీ హాల్‌ను పవన్‌మూర్తి నిర్వహించే వారు. హాలు తాళాలను తన ఆధీనంలో పెట్టుకుని ఎవరికీ ఇవ్వకపోవడం, గ్రంథాలయం, జిమ్ నిర్మించేందుకు ప్రతిపాదించిన 400 గజాల కార్పొరేషన్ స్థలాన్ని కబ్జాచేసి గోడలు కట్టేయడం ఇవన్నీ కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి గెలిచాక జరిగినవేనని స్థానికులంటున్నారు. మార్కెట్ స్థలా న్ని కూడా ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గత నెల 16నే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, అధికార పార్టీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కావడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో ఇంతవరకూ చర్యలు తీసుకున్న దాఖలా లేదు. కబ్జాలపై కార్పొరేషన్ అధికారులకు సమగ్రమైన వివరాలు అందచేసినా కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాకినాడ దుగ్గిరాలవారివీధిలో ఒక ఎయిడెడ్ పాఠశాల పాత భవనాలను కూల్చేసి తెగనమ్మేందుకు ప్రయత్నించిన తెలుగుతమ్ముళ్లు స్థానికుల వ్యతిరేకతతో తోకముడవక తప్పలేదు. ఇప్పుడు పర్లోపేటలో బరితెగించిన ఎమ్మెల్యే అనుచరుడిపై అధికారులు కొరడా ఝుళిపిస్తారో, జో హుకుం అంటారో వేచి చూడాలి. విచారణకు ఆదేశించాం.. పర్లోపేటలో మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదుపై విచారణ జరపాల్సిందిగా టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించామని కార్పొరేషన్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి చెప్పారు. విచారణ అనంతరం మున్సిపల్ స్థలంగా తేలితే స్వాధీనం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాలు, ఆస్తులను పరిరక్షించాలి.. ప్రభుత్వ ఆస్తులపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు, మాజీ కౌన్సిలర్ పవన్‌మూర్తి పెత్తనం చలాయిస్తున్నాడు. అతని కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వాస్తులను అధికారులు పరిరక్షించాలి. మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనుకుంటున్నాడు. 400 గజాల స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ నిర్మించాడు. కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి పెత్తనంసాగిస్తున్నాడు. - దిబ్బాడ సత్తిరాజు, శ్రీ వెంకట సత్యసాయి మెరైన్ ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటి అధ్యక్షుడు