
విశాఖపట్టణంలో ఒక సాహిత్య సభ జరిగింది. ఆరోజు శ్రీశ్రీ కాస్త నలతగా ఉన్నారు. కట్టుకున్న పంచె కొంచెం పట్టు సడలింది. అందుకని కూర్చునే ఉపన్యాసం ప్రారంభించారు.
‘‘నిలబడి మాట్లాడాలి’’ అంటూ సభలో కొందరు కేకలేశారు. అప్పుడు శ్రీశ్రీ– ‘‘నేను నిలబడితే దిగంబరుడినవుతా, అదీ నా భయం’’ అన్నారు.
వేదిక మీద ఆయన వెనుకనే దిగంబర కవులు కూర్చొని ఉన్నారు. అందుకనే శ్రీశ్రీ ఆ ఛలోక్తి విసిరారు. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు