కాల్‌మనీ వ్యాపారులపై చర్య తీసుకోవాలి
విజయవాడ(గాంధీనగర్) : దళిత, గిరిజనులను వేధిస్తున్న కాల్‌మనీ, వడ్డీ వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యాపారులపై దళితులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు బాధ్యతాయుతంగా దర్యాప్తు కొనసాగించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లోనూ దళితులకు న్యాయం చేయడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవానరంలో బుడగ జంగాల కులస్తులు కాల్‌మనీ వ్యాపారులపై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని చెప్పారు. ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేవీపీసీఎస్ నాయకులు పరిశపోగు రాజేష్ మాట్లాడుతూ చట్టవ్యతిరేకంగా సాగిస్తున్న వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని కోరారు.