
మాట్లాడుతున్న ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
శ్రీనగర్‌కాలనీ: మాదిగల రిజర్వేషన్లు, అభ్యున్నతికి అన్ని సంఘాలు సంఘటితం కావాలని తెలంగాణా ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అద్యక్షుడు గజ్జల మల్లికార్జున్ మాదిగ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న ర్యాలీ, ధర్నాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మాదిగలకు 12శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చాడలింగం, మోజేష్, పాలడుగు సాలయ్య, జానయ్య, విజయ, మురళి, మల్లేష్, నడిమింటి కృష్ణ, ముత్తయ్య, రాజ్‌కుమర్ పాల్గొన్నారు.