Ravi pidamarti
-
హక్కుల సాధనకు సంఘటిత పోరాటం
శ్రీనగర్‌కాలనీ: మాదిగల రిజర్వేషన్లు, అభ్యున్నతికి అన్ని సంఘాలు సంఘటితం కావాలని తెలంగాణా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అద్యక్షుడు గజ్జల మల్లికార్జున్ మాదిగ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న ర్యాలీ, ధర్నాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మాదిగలకు 12శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చాడలింగం, మోజేష్, పాలడుగు సాలయ్య, జానయ్య, విజయ, మురళి, మల్లేష్, నడిమింటి కృష్ణ, ముత్తయ్య, రాజ్‌కుమర్ పాల్గొన్నారు. -
‘ఉద్యమ ద్రోహులు ముఖ్య అతిథులా?’
హైదరాబాద్: ‘తెలంగాణ ఉద్యమ ద్రోహులు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు ముఖ్య అతిథులా...?’ అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రశ్నించారు. శనివారం ఓయూ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుదుర్చుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే వారి కనుసన్నల్లో ఓయూలో సభలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు తాను కూడా విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించానని, ఓయూలో జరిగే సభకు ఆయనను ఆహ్వానించి తనను పిలవకపోవడం దురదృష్టకరమని పిడమర్తి రవి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు దూదిమెట్ల బాలరాజ్యాదవ్, బండారు వీరీబాబు, గుండగాని కిరణ్‌గౌడ్, వడ్డె ఎల్లన్న, శంకర్‌నాయక్, మంద సురేశ్, సుధాకర్‌మాదిగ, కృష్ణమాదిగ, భుట్టు శ్రీహరినాయక్ పాల్గొన్నారు. -
తెలంగాణలో మందకృష్ణ సినిమా క్లోజ్
చెల్లని నాణెంలాంటి వ్యక్తి ఎస్సీ కార్పొరేషన్ చెర్మైన్ పిడమర్తి రవి మహబూబాబాద్ : తెలంగాణలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సినిమా క్లోజ్ అయ్యిందని, చెల్లని నాణెంలాంటి వ్యక్తి అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని పక్కకు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వర్గంలో మాల, మాదిగలకు అవకాశం కల్పించాలని ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోవడం సరికాదన్నారు. మందకృష్ణ మాదిగ జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాల, మాదిగలకు సీఎం కేసీఆర్ వ్యతిరేకం కాదన్నారు. చెరుకు సుధాకర్, విమలక్క, శంకర్రావు విషయంలో మందకృష్ణ మాదిగ ఎన్నో జిమ్మిక్కులు చేశారన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. అభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు.కేయూ జేఏసీ చెర్మైన్ వీరేందర్, కన్వీనర్ మధూకర్, పలు సంఘాల నాయకులు భాస్కర్ నాయక్, నీలేష్ రాయి, స్వామి నాయక్, నరేష్, ఇనుగుర్తి సుధాకర్, దర్శనం రామకృష్ణ, దార్ల శివరాజ్, పొన్నాల యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు.