వేణుగోపాల్, శ్రీకాంత్‌రావు, వనజ, రవికాంత్‌రెడ్డి
పంజగుట్ట (హైదరాబాద్): ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు ఎల్.వేణుగోపాలనాయుడు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కె.శ్రీకాంత్‌రావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా సి.వనజ, జనరల్ సెక్రటరీగా ఆర్.రవికాంత్‌రెడ్డి విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శులుగా రమేశ్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, ట్రెజరర్‌గా ఎ.రాజేశ్.. ఈసీ సభ్యులుగా ఎ.పద్మావతి, ఎం.రమాదేవి, ఎన్.ఉమాదేవి, పి.అనిల్‌కుమార్, కె.శ్రీనివాస్, బి.గోపరాజు, జి.వసంత్‌కుమార్, ఎం.రాఘవేంద్రరెడ్డి, టి.శ్రీనివాస్, వి.బాపూరావు గెలుపొందారు.
మొత్తమ్మీద ప్రెస్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. అధ్యక్షుడి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ల (ఈసీ) వరకు మొత్తం 17 స్థానాలకుగాను 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రెస్ క్లబ్‌లో 1,251 మంది యాక్టివ్ ఓటర్లు ఉండగా.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బ్యాలెట్ విధానంలో 1,114 మంది ఓట్లు వేశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లతోపాటు వివిధ పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు 12 గంటల సమయంలో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment