Venugopal Naidu
-
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా వేణుగోపాలనాయుడు
పంజగుట్ట (హైదరాబాద్): ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు ఎల్.వేణుగోపాలనాయుడు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కె.శ్రీకాంత్‌రావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా సి.వనజ, జనరల్ సెక్రటరీగా ఆర్.రవికాంత్‌రెడ్డి విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శులుగా రమేశ్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, ట్రెజరర్‌గా ఎ.రాజేశ్.. ఈసీ సభ్యులుగా ఎ.పద్మావతి, ఎం.రమాదేవి, ఎన్.ఉమాదేవి, పి.అనిల్‌కుమార్, కె.శ్రీనివాస్, బి.గోపరాజు, జి.వసంత్‌కుమార్, ఎం.రాఘవేంద్రరెడ్డి, టి.శ్రీనివాస్, వి.బాపూరావు గెలుపొందారు. మొత్తమ్మీద ప్రెస్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. అధ్యక్షుడి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ల (ఈసీ) వరకు మొత్తం 17 స్థానాలకుగాను 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రెస్ క్లబ్లో 1,251 మంది యాక్టివ్ ఓటర్లు ఉండగా.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బ్యాలెట్ విధానంలో 1,114 మంది ఓట్లు వేశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లతోపాటు వివిధ పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు 12 గంటల సమయంలో ముగిసింది. -
ఉరి వేసుకుని ఉద్యోగి ఆత్మహత్య
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని ఐసీఎల్ కర్మాగారం ఉద్యోగి జి.వేణుగోపాల్ నాయుడు(52) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటనాయుడు సోమవారం తెలిపారు. ఐసీఎల్ కర్మాగారంలో ఆయన 25 ఏళ్లకు పైగా మెకానిక్‌గా పని చేస్తుండే వారు. ఐసీఎల్ కాలనీలోని ఏ/52 నంబరు గల ఇంటిలో భార్య పిల్లలతో జీవించే వారు. ఆయనకు భార్య విజయలక్ష్మితోపాటు పిల్లలు సందీప్, సుచరిత ఉన్నారు. వేణుగోపాల్ నాయుడు కొంత కాలంగా బీపీ, షుగర్‌తో బాధపడుతుండే వారు. మూడు రోజుల కిందట భార్య తన అమ్మవారి ఇంటికి పోయివస్తానని చెప్పి పిల్లలతో వెళ్లింది. అనారోగ్యంతో జీవితం విరక్తి చెందిన ఆయన ఇంటిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హౌసింగ్ ఏఈ ఇళ్లపై ఏసీబీ దాడులు
విజయనగరం జిల్లా సాలూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈగా పనిచేస్తున్న రెడ్డి వేణుగోపాలనాయుడు ఇళ్లపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు. ప్రస్తుతం వేణుగోపాలనాయుడు ఉంటున్న బొబ్బిలిలోని నివాసంలో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. అలాగే, మండలంలోని దుబ్బగూడలో ఉన్న వేణుగోపాలనాయుడు కుటుంబసభ్యుల ఇంట్లో ఏసీబీ సీఐ రమేష్ ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.