రైతు, డ్వాక్రా రుణమాఫీ కోసం చేస్తున్న మహాధర్నాకు అంతా కదం తొక్కాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.
అనంతపురం అర్బన్ : రైతు, డ్వాక్రా రుణమాఫీ కోసం చేస్తున్న మహాధర్నాకు అంతా కదం తొక్కాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం ప్రెస్‌క్లబ్ వద్ద బైక్ ర్యాలీని ఆ పార్టీ నేతలు చవ్వా రాజశేఖరరెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురాం, అనంత చంద్రారెడ్డి, మీసాల రంగన్న, రిలాక్స్ నాగరాజు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. టవర్‌క్లాక్ నుంచి శ్రీకంఠం సర్కిల్, పాతూరు మీదుగా సుభాష్‌రోడ్డులోని నందినిహోటల్ ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు శాశ్వత రుణగ్రస్తులుగా మిగిలిపోయారని ఆరోపించారు. ఓవైపు నిత్యం కరువు, మరోవైపు అప్పులు పుట్టని పరిస్థితితో అన్నదాత ఆత్మహత్యలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధించిన రూ.6234 కోట్లను ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ లోక్‌నాథ్‌రెడ్డి, టీ.కృష్ణమూర్తి, ఆకుతోటపల్లి ఆనంద్, మహబూబ్‌పీరా, పెన్నోబుళేసు, విద్యార్థి విభాగం నాయకులు చింతా సోమశేఖర్‌రెడ్డి, కేవీ మారుతీప్రకాష్, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, జయరాంనాయక్, శ్యాంసుందర్‌శాస్త్రి, విద్యాసాగర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, శ్రీనివాసులు, రాజేష్‌రెడ్డి, ఖాజాహుస్సేన్, మోసీ, వెంకటేశ్వర్‌రెడ్డి, వడ్డేశీనా, చిన్నా, ఆవుల రాఘవేంద్రరెడ్డి, సురేష్, క్రిష్ణమూర్తి, నాగేంద్రరెడ్డి, రామయ్య, యెడుగూరి అనుదీప్, చవ్వా అంకిత్ తదితరులు పాల్గొన్నారు.