ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని విలువైన కశెట్టి హైస్కూల్ ఆస్తులను అమ్ముకుంటున్నారని దువ్వూరు పోతులూరయ్య ఆచారి తెలిపారు. ఆయన శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్యవైశ్య ప్రముఖుడు కశెట్టి చిన్నవెంకటసుబ్బయ్య మంచి ఆశయంతో పేద, బడుడు, బలహీన వర్గాల పిల్లల కోసం కశెట్టి చిన్నవెంకటసుబ్బయ్య చారిటీస్ సంస్థను నెలకొల్పి సంస్థ ఆధ్వర్యంలో ఎయిడెడ్ హైస్కూల్‌ను స్థాపించారన్నారు. వెంకటసుబ్బయ్య మరణానంతరం చారిటీస్‌కు చెందిన ఆస్తులను ఓ వ్యక్తి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా తప్పుడు సమాచారం ఇచ్చి తనకు ఓ స్థలం అమ్మారని, దీన్ని ప్రశ్నిస్తే తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.