రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి, మందీ మార్బలం, ప్రచారార్భాటంతో ఎన్నికల్లో హల్‌చల్ చేస్తారు. ఇవేమీ లేని అభ్యుదయవాదులు, ఔత్సాహికులు కూడా ఏ పార్టీ గుర్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ గెలిచేది మాత్రం తక్కువమంది. ఒకప్పుడు 40 మందికిపైగా ఉన్న స్వతంత్ర శాసనసభ్యులు ఇప్పుడు నలుగురికి మించడం లేదు. పెద్ద పారీ్టల ధాటికి స్వతంత్రులు నిలవడం లేదు.
కర్ణాటక: కన్నడనాట ప్రతి ఎన్నికల సమయంలో సత్తా చాటుతున్న స్వతంత్ర అభ్యర్థులు ఈసారి నామమాత్రమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ప్రతిసారి నంబర్ గేమ్‌కు అవసరమయ్యేది స్వతంత్రులే. కానీ 16 వ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో స్వతంత్ర ఎమ్మెల్యేల అవసరం లేకుండా పోయింది.
2018లో ఒక్కరు
► 1985 నుంచి ఇప్పటివరకు వేలాది మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీచేశారు. కానీ గెలుపొందిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.
► 2018 ఎన్నికల్లో 1,142 మంది స్వతంత్రులు పోటీచేయగా 3.96 శాతం ఓట్లు పొందారు, గెలిచింది మాత్రం ఒక్కరే.
► తాజా ఎన్నికల్లో 918 మంది స్వతంత్రులు, చిన్నపార్టీల నుంచి 693 మంది అభ్యర్థులతో కలిపి 1,611 మంది బరిలో నిలిచారు, గెలిచింది నలుగురు మాత్రమే.
1967లో 41 మంది విజయం
► 1957 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 251 మంది స్వతంత్రులు పోటీచేయగా వారిలో 35 మంది గెలుపొందారు.
► 1962 లో 179 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేసి 27 మంది గెలిచారు.
► 1967 లో 331 మంది స్వతంత్రులు పోటీచేయగా ఏకంగా 41 మంది విజయకేతనం ఎగురవేశారు. ఇది ఇప్పటివరకు చారిత్రక రికార్డు. ఆ తరువాత నుంచి స్వతంత్రుల హవాకు బ్రేక్ పడింది.
ప్రతిసారీ 25 లక్షల దాకా ఓట్లు
► 1978లో అతి తక్కువ అంటే 9,40,677 ఓటర్లు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులకు ఓటేశారు.
► 1967లో 21,29,786 ఓట్లు, 1999లో 26,66,444 ఓట్లు, 2013లో 23,13,386 ఓట్లు స్వతంత్రులకు వచ్చాయి.
► ఇప్పటి ఎన్నికల్లో 22,54,882 (5.81) ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment