సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి తనకే దక్కేలా సీఎల్పీ నేత సిద్దరామయ్య రహస్య సమావేశాలకు నాంది పలికారు. బెంగళూరులోని ఓ భవనంలో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించనున్నారని సమాచారం. ఎం.బీ.పాటిల్, జమీర్ అహమ్మద్‌ఖాన్, ఉత్తర కర్ణాటకకు ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశముంది. మరోవైపు కొత్త సీఎంకు శుభాభినందనలు అని సిద్దు ఇంటి ముందు కొందరు అభిమానులు పోస్టర్లు కట్టారు.
సిద్దును కలిసిన లత
హరపనహళ్లి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన లతా మల్లికార్జున, సిద్దరామయ్యను భేటీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఫోటోను ట్వీట్ చేసిన సిద్దరామయ్య, విజయం సాధించిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు.
చదవండి: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు..
దొడ్డ కాంగ్రెస్‌లో విచారం
దొడ్డ కాంగ్రెస్‌లో విషాద ఛాయలు అలముకొన్నాయి. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణయ్య ఓడిపోవడం ఏమిటని కార్యకర్తలు దిగులు చెందారు. గెలుపు కచ్చితమని మెజారిటీనే తేలాల్సి ఉందని, ఆయన మంత్రి కావడమే ఆలస్యమని కార్యకర్తలు, అభిమానులు ప్రచారం చేసుకుంటే తీరా ఫలితాల్లో ఓడిపోయారు. మొదటిసారి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ధీరజ్ మునిరాజు రాష్ట్రంలో ఆ పార్టీకి వ్యతిరేకత ఉన్నా 31 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో కాంగ్రెస్ కంగుతింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టబోతున్నా విజయోత్సవం చేసుకోలేని పరిస్థితిలో దొడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో నెలమంగల, దేవనహళ్లి, హొసకోట తాలూకాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికై సత్తా చాటారు. ఒక్క దొడ్డలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ పార్టీ ఆఫీసు వెలవెలబోతోంది. కాంగ్రెస్ హవా ఉన్నా ఓడిపోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment