కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) స్థానాలకు ప్రధాన పార్టీల కంటే స్వతంత్ర అభ్యర్థులే అధికంగా నామినేషన్ వేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు అధికారులు కసరత్తు చేసి ఉపసంహరణ అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను మంగళవారం ఉదయం ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానాలు 52 ఉండగా 269 మంది, ఎంపీటీసీ స్థానాలు 636 స్థానాలకు, 2,654 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇందులో జెడ్పీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులు 70 మంది బరిలో ఉండగా,ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు 52 మంది చొప్పున నామినేషన్ వేశారు. ఇక బీజేపీకి 32, టీడీపీకి 43, బీఎస్పీకి 11, సీసీఎం 8, సీసీఐ 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒక్కోస్థానానికి ఒక్కో నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ, టీడీపీలకు అభ్యర్థులు కరువయ్యారు.
ఇక, 636 ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్రులు 672 మంది పోటీకి దిగగా, కాంగ్రెస్ 599, టీఆర్‌ఎస్ 593, టీడీపీ 390, బీజేపీ 247, బీఎస్పీ 84, సీపీఐ 42, సీపీఎం 25, వైఎస్సార్ సీపీ 2కి చొప్పున బరిలో నిలిచారు. అంటే ప్రధాన పార్టీలకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా లేరు. కాంగ్రెస్‌కు 37, టీఆర్‌ఎస్‌కు 43, టీడీపీకి 246, బీజేపీకి 389 స్థానాల నుంచి ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు.
స్వతంత్రులే అధికం
Published Wed, Mar 26 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement