సాక్షి, న్యూఢిల్లీ/పటా్న: బిహార్‌లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అయిన మహాగuŠ‡బంధన్(ఎంజీబీ) మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు, మూడింట రెండొంతుల మెజారిటీ దక్కించు కుంటుందని మరికొన్ని సంస్థలు తేల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకోగా.. ఏడాదిన్నర కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మహాగuŠ‡బంధన్ వైపే ప్రజలు మొగ్గు చూపించినప్పటికీ హంగ్ అసెంబ్లీకి కూడా అవకాశాలున్నట్టుగా వివిధ సర్వేలు చూస్తే వెల్లడవుతుంది.
నితీశ్‌కుమార్ వరసగా నాలుగోసారి సీఎం కావాలని తహతహలాడుతూ ఉంటే, తన తండ్రి లాలూ ప్రచారం చేయకపోయినా తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఆర్‌జేడీని బలోపేతం చేశారని, యువతరాన్ని ఆకర్షించారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై గత ఏడెనిమిది నెలలుగా నితీశ్ సరిగ్గా స్పందించలేదని, ప్రతిపక్షంలో ఉన్న తేజస్వీ యాదవ్ ఆర్థిక అంశాలు, నిరుద్యోగితపై ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడంలో సఫలీకృతుడయ్యారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీ సహా ఆరు పార్టీల కూటమి అయిన గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్(జీడీఎస్‌ఎఫ్) ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెద్దగా చీల్చలేకపోయిందన్నాయి.
తేజస్వీ యాదవ్ సీఎం కావాలి
ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వేలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలి ప్రశ్నకు 44 శాతం మంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌నే ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని స్పష్టంగా చెప్పారు. నితీశ్‌కుమార్ సీఎం కావాలని 35% మంది కోరుకుంటే, దివంగత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 7% మంది, ఉపేంద్ర కుష్వా ముఖ్యమంత్రి కావాలని 4% మంది ఆశించారు. బిహార్‌లో తన తండ్రి మాదిరిగా కులాల చట్రంలో పడి కొట్టుకుపోకుండా కొత్త తరహా రాజకీయాలకు తేజస్వీ యాదవ్ తెరతీశారని ఇండియా టుడే విశ్లేíÙంచింది.
మధ్యప్రదేశ్‌లో చౌహాన్ సర్కార్ సురక్షితం!
మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడంతో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు శివరాజ్‌సింగ్ సర్కార్‌పై ప్రభావం చూపించే అవకాశాలు ఉండడంతో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీకి 16–18, కాంగ్రెస్‌కి 10–12 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆజ్‌తక్ సర్వే కాంగ్రెస్‌కు 16–18, బీజేపీకి 10–12స్థానాలు వెల్లడించింది.
యువతరం ప్రతినిధి తేజస్వి
30 ఏళ్ల వయసున్న తేజస్వి తనని తాను యువతరానికి ప్రతినిధిగా ఒక ఇమేజ్ సంపాదించడమే కాకుండా ఉద్యోగాల కల్పన, అభివృద్ధి వంటి అంశాలతో ప్రచారానికి కొత్త రూపు కలి్పంచారని ఇండియా టుడే అభిప్రాయపడింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వీ హామీ ఇవ్వడమే కాకుండా, లాక్‌డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కారి్మకుల కష్టాలపైనే ఆయన ఎన్నికల ప్రచారంలో దృష్టి సారించారు. అధికార నితీశ్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన అంశాలను పట్టుకొని వాటినే పదే పదే ప్రస్తావిస్తూ యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు.
వలస కారి్మకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుపేద మధ్య తరగతి వర్గాలన్నీ ఈసారి తేజస్వీ యాదవ్ వైపే ఉన్నట్టుగా ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ముస్లిం, యాదవ్‌లు అంటూ కులాల వారీగా మద్దతు కూడగట్టుకోకుండా కష్టాల్లో ఉన్న వారి అండని సంపాదించడానికి తేజస్వి ప్రయత్నించారు. తేజస్వి ప్రచార సభలకి జనం వెల్లువెత్తడం, ఆవేశపూరితంగా ఆయన చేసే ప్రసంగాలు ఎన్నికల ఫలితాల్ని మార్చబోతున్నాయని ఇండియా టుడే విశ్లేíÙంచింది.
Comments
Please login to add a commentAdd a comment