rjd and congress
-
మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు!
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమితో బంధం తెంచుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జట్టుకట్టి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువుతీర్చిన సీఎం నితీశ్‌కుమార్ క్రిమినల్ కేసులున్న నేతలతో దాదాపు మొత్తం మంత్రివర్గాన్ని నింపేశారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో 70 శాతానికిపైగా నేతలపై క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ నివేదించింది. రెండేళ్ల క్రితం రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా అభ్యర్థులుగా వీరంతా సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్, బిహార్ ఎలక్షన్ వాచ్ సంస్థ సంయుక్తంగా క్షుణ్ణంగా పరిశీలించాక ఈ నివేదికను బహిర్గతంచేసింది. ఇందుకోసం సీఎం నితీశ్ సహా 33 మంది మంత్రుల్లో 32 మంది అఫిడవిట్లను పరిశీలించారు. మొత్తం మంత్రుల్లో 23 మంది(72 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 17 మంది మంత్రులు(53 శాతం) తమపై తీవ్రమైన నేరమయ కేసులున్నాయి. మొత్తం మంత్రుల్లో 27 మంది(84 శాతం) కోటీశ్వరులుకాగా, మొత్తం 32 మంది మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.5.82 కోట్లు. పాతిక శాతం మంది మంత్రులు తమ విద్యార్హతలు 8వ తరగతి నుంచి ఇంటర్‌లోపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. జేడీ(యూ) నుంచి 11 మంది, ఆర్జేడీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే మంత్రులుగా కొనసాగుతున్నారు. -
ఆర్జేడీ కూటమికే జై
సాక్షి, న్యూఢిల్లీ/పటా్న: బిహార్‌లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అయిన మహాగuŠ‡బంధన్(ఎంజీబీ) మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు, మూడింట రెండొంతుల మెజారిటీ దక్కించు కుంటుందని మరికొన్ని సంస్థలు తేల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకోగా.. ఏడాదిన్నర కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మహాగuŠ‡బంధన్ వైపే ప్రజలు మొగ్గు చూపించినప్పటికీ హంగ్ అసెంబ్లీకి కూడా అవకాశాలున్నట్టుగా వివిధ సర్వేలు చూస్తే వెల్లడవుతుంది. నితీశ్‌కుమార్ వరసగా నాలుగోసారి సీఎం కావాలని తహతహలాడుతూ ఉంటే, తన తండ్రి లాలూ ప్రచారం చేయకపోయినా తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఆర్జేడీని బలోపేతం చేశారని, యువతరాన్ని ఆకర్షించారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై గత ఏడెనిమిది నెలలుగా నితీశ్ సరిగ్గా స్పందించలేదని, ప్రతిపక్షంలో ఉన్న తేజస్వీ యాదవ్ ఆర్థిక అంశాలు, నిరుద్యోగితపై ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడంలో సఫలీకృతుడయ్యారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ సహా ఆరు పార్టీల కూటమి అయిన గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్(జీడీఎస్ఎఫ్) ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెద్దగా చీల్చలేకపోయిందన్నాయి. తేజస్వీ యాదవ్ సీఎం కావాలి ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వేలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలి ప్రశ్నకు 44 శాతం మంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌నే ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని స్పష్టంగా చెప్పారు. నితీశ్‌కుమార్ సీఎం కావాలని 35% మంది కోరుకుంటే, దివంగత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 7% మంది, ఉపేంద్ర కుష్వా ముఖ్యమంత్రి కావాలని 4% మంది ఆశించారు. బిహార్‌లో తన తండ్రి మాదిరిగా కులాల చట్రంలో పడి కొట్టుకుపోకుండా కొత్త తరహా రాజకీయాలకు తేజస్వీ యాదవ్ తెరతీశారని ఇండియా టుడే విశ్లేíÙంచింది. మధ్యప్రదేశ్‌లో చౌహాన్ సర్కార్ సురక్షితం! మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడంతో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు శివరాజ్‌సింగ్ సర్కార్‌పై ప్రభావం చూపించే అవకాశాలు ఉండడంతో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీకి 16–18, కాంగ్రెస్‌కి 10–12 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆజ్‌తక్ సర్వే కాంగ్రెస్‌కు 16–18, బీజేపీకి 10–12స్థానాలు వెల్లడించింది. యువతరం ప్రతినిధి తేజస్వి 30 ఏళ్ల వయసున్న తేజస్వి తనని తాను యువతరానికి ప్రతినిధిగా ఒక ఇమేజ్ సంపాదించడమే కాకుండా ఉద్యోగాల కల్పన, అభివృద్ధి వంటి అంశాలతో ప్రచారానికి కొత్త రూపు కలి్పంచారని ఇండియా టుడే అభిప్రాయపడింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వీ హామీ ఇవ్వడమే కాకుండా, లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కారి్మకుల కష్టాలపైనే ఆయన ఎన్నికల ప్రచారంలో దృష్టి సారించారు. అధికార నితీశ్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన అంశాలను పట్టుకొని వాటినే పదే పదే ప్రస్తావిస్తూ యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. వలస కారి్మకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుపేద మధ్య తరగతి వర్గాలన్నీ ఈసారి తేజస్వీ యాదవ్ వైపే ఉన్నట్టుగా ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ముస్లిం, యాదవ్‌లు అంటూ కులాల వారీగా మద్దతు కూడగట్టుకోకుండా కష్టాల్లో ఉన్న వారి అండని సంపాదించడానికి తేజస్వి ప్రయత్నించారు. తేజస్వి ప్రచార సభలకి జనం వెల్లువెత్తడం, ఆవేశపూరితంగా ఆయన చేసే ప్రసంగాలు ఎన్నికల ఫలితాల్ని మార్చబోతున్నాయని ఇండియా టుడే విశ్లేíÙంచింది. -
బిహార్‌లో మహాకూటమి సీట్ల ఖరారు
పట్నా: బిహార్‌లో మహాకూటమిలోని పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పంపిణీ పూర్తయింది. ఈ రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా ఆర్జేడీకి 20 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. ఉపేంద్ర కూష్వాహకు చెందిన ఆర్ఎల్ఎస్పీ ఐదు స్థానాల్లో, జతిన్ రాం మాంఝీ పార్టీ హెచ్ఏఎం మూడు చోట్ల, ముకేశ్ సాహ్నీకి చెందిన వీఐపీ మూడు సీట్లలో పోటీ చేయనుంది. అయితే ఆర్జేడీ తమకు దక్కిన 20 సీట్ల నుంచి అరా నియోజకవర్గాన్ని సీపీఐ(ఎంఎల్)కు వదిలిపెట్టింది. సీట్ల కేటాయింపు వివరాలను బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వెల్లడించారు. దర్భంగా నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కీర్తి ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దర్భంగా టికెట్‌ను కీర్తికే ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.∙ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆర్జేడీ అబ్దుల్ బరీ సిద్దిఖీని బరిలోకి దింపుతోంది. ప్రధానంగా ఈ కారణంగానే సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాటలీపుత్ర నుంచి మిసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి పోటీ చేయనున్నారు. దర్భంగా నుంచి అబ్దుల్ బరీ సిద్దిఖీని ఆర్జీడీ పోటీకి దింపుతుండటం అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు ఆర్జేడీ సీనియర్ నేత అష్రఫ్ ఫాత్మికి కూడా ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఫాత్మి ఆ స్థానం నుంచి గతంలో చాలా సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. బెగుసరాయ్ నియోజకవర్గంలో 2014లో పోటీచేసి ఓడిపోయిన తన్వీర్ హస్సన్‌నే ఆర్జేడీ మళ్లీ బరిలోకి దింపింది. పట్నాలో మీడియాతో మాట్లాడుతున్న తేజస్వీ -
అధికార కూటమిలో అప్పుడే బీటలు!
బిహార్‌లో బీజేపీని ఓడించడానికి బద్ధశత్రువులైన జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్.. మూడు పార్టీలు కలిశాయి. అనుకున్నట్లే బ్రహ్మాండమైన మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టాయి. నితీష్‌కుమార్‌ను ముఖ్యమంత్రిగాను, ఆర్జేడీ అధినేత లాలు కుమారుల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగాను చేశారు. అంతవరకు అంతా బాగానే కనిపించింది గానీ, ఒక్క ఏడాది గడిచిందో లేదో.. అప్పుడే అధికార కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. సర్కారు గోడలకు బీటలు వారుతున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు గానీ.. ఇదే ఒరవడి కొనసాగితే ప్రభుత్వం ఎన్నాళ్లు నిలబడుతుందో అనేది అనుమానంగానే ఉంది. అధికార పార్టీ జేడీ(యూ) సభ్యుడు, మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజయ్ అలోక్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి మందగమనానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని ట్విట్టర్లో మండిపడ్డారు. రాష్ట్రంలోని 182 ప్రాజెక్టుల మీద ఇప్పటివరకు ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టలేదని, దానివల్ల రూ. 11 వేల కోట్ల నిధులు వృథా అయ్యాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన మంత్రులే ఈ రెండు శాఖలను చూస్తున్నందున.. ఆ పార్టీలే ఇందుకు బాధ్యత వహించాలన్నట్లుగా అలోక్ వ్యాఖ్యానించారు. తప్పు చేసింది ఆ రెండు పార్టీలయితే అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను తప్పుబడుతున్నారని అన్నారు. కాగ్ నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారని ఆయన చెప్పారు. పన్ను వసూళ్లలో బిహార్ 22 శాతం వృద్ధి నమోదు చేసిందని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. ఇలాంటి విజయాలతో పాటు వైఫల్యాలకు కూడా ఆయన్నే బాధ్యులను చేస్తున్నారని, దీనిపై తాను ఆందోళన వ్యక్తం చేశానని అన్నారు. 182 project ? Not a single penny spent!! 11000 cr lapsed ,do u know most dept from Cong and Rjd but responsibility is ours @NitishKumar — Dr Ajay Alok (@alok_ajay) 28 March 2017