న్యూఢిల్లీ : మహా కూటమిలో చేరే ఉద్దేశమే లేదని బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేస్తోన్న మహా కూటమిలోగానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోగానీ తమ పార్టీ చేరబోదని బుధవారం ప్రకటించారు. దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని నవీన్ పట్నాయక్ తెలిపారు.
బీజేడీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలన్నీ తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటి చేస్తామని వెల్లడించారు. ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలున్నాయి. అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుందని 20 స్థానాల్లో బీజేడి ఘనవిజయం సాధించిందని గుర్తుచేశారు. దాంతో ఈ సారి ఎన్నికల్లో బీజేపీ ఒడిశాలో ఎక్కువ సీట్ల గెలుపొందాలనే ప్రయత్నంలో ఉంది. ఇక పోతే గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఒక్కసీటును కూడా దక్కించుకోలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment