వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న సీఎం నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ : గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ‘మన పల్లె–మన వికాసం’ పథకంలో భాగంగా 3 జిల్లాల్లోని 68 పంచాయతీలకు రూ.16.60 కోట్లు మంజూరుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ‘మన పల్లె–మన వికాసం’ కార్యక్రమంపై నిర్వహించారు. సమితి స్థాయిలో ఈ కార్యక్రమం నిధుల్ని మంజూరు చేయడం ఇటీవల ప్రారంభించారు. బాలాసోర్, ఢెంకనాల్, భద్రక్ జిల్లా గ్రామ పంచాయతీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. ఒక్కో పంచాయతీలో గ్రామీణ అభివృద్ధి పరిస్థితులను ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం 3 జిల్లాల్లోని 68 పంచాయతీలకు రూ.16.60 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. బాలాసోర్ జిల్లా నీలగిరి సమితి, ఢెంకనాల్ జిల్లా కొంకొడాహడో, భద్రక్ జిల్లా భొండారిపొఖొరి çసమితులకు ఈ నిధులు మంజూరయ్యాయి. బాలాసోర్ జిల్లా నీలగిరి సమితిలోని 25 పంచాయతీల్లో 302 ప్రాజెక్టులకు రూ. 6.25 కోట్లు, డెంకనాల్ జిల్లా కొంకొడాహడో సమితి 21 పంచాయతీల్లో 152 ప్రాజెక్టులకు రూ.4.85 కోట్లు, భద్రక్ జిల్లా భొండారిపొఖోరి సమితి 22 పంచాయతీల్లోని 222 ప్రాజెక్టులకు రూ.5.50 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment