
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బిజూ జనతాదల్ (బీజేడీ) ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.
సుదీర్ఘ కాలంగా పవర్‌లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో తాజా ఫలితాల ప్రకారం బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. మరోవైపు అధికార బీజేడీ మూడు పదుల సీట్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment