పూరీ (ఒడిశా): ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ఒడిశాకు చెందిన ఓ ఛాయ్‌వాలా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. టీ అమ్ముతూ జీవనం గడుపుతున్న 26 ఏళ్ల సుకాంత ఘడాయ్ పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
కరీంపూర్ గ్రామానికి చెందిన ఘడాయ్ తనకు స్థిర, చర ఆస్తులు ఏమీ లేవని తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఘడాయ్ తనకు ప్రధాని నరేంద్ర మోదీనే స్ఫూర్తి అని, ఆయన ప్రధాని కాగలిగితే, తోటి ఛాయ్‌వాలా అయిన తాను ఎమ్మెల్యే కాలేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే లంచాల సంస్కృతిని అరికట్టి నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతానని, అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడాన్ని పరిష్కరిస్తానని తన ప్రణాళికను ప్రకటించారు. తాను సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సుకాంత ఘడాయ్ చెబుతన్నారు.
కాగా బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బీజేడీ అభ్యర్థి ఉమాకాంత సామంతరాయ్, బీజేపీకి చెందిన ఉపాస్నా మహపాత్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రభాను మోహపాత్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ మే 25న పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment