richest candidate
-
రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..
భారతదేశంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాదిరిగానే.. పాకిస్థాన్‌లో అత్యంత సంపన్నుడు 'షాహిద్ ఖాన్' (Shahid Khan). బహుశా ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ జాక్సన్విల్లే జాగ్వార్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఫుల్హామ్ ఎఫ్‌సీ వంటి వాటిని సొంతం చేసుకుని బాగా ఫేమస్ అయ్యారు. ఈయన కుమారుడు టోనీ ఖాన్, కుమార్తె షన్నా ఖాన్. కొడుకు తండ్రి బాటలో నడుస్తుంటే.. కుమార్తె మాత్రం దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.షన్నా ఖాన్ (Shanna Khan) అమెరికాలోని ఇల్లినాయిస్లో.. సోదరుడు టోనీతో కలిసి పెరిగింది. ఈమె ప్రత్యేకమైన ప్యాకేజింగ్ డిజైన్ ఆర్గనైజేషన్ 'యునైటెడ్ మార్కెటింగ్ కంపెనీ'ని కూడా నిర్వహిస్తోంది. అటు వ్యాపారం, ఇటు సామజిక సేవ రెండింటిలోనూ తన నిబద్ధతను చాటుకుంటోంది.షన్నా ఖాన్.. జాగ్వార్స్ ఫౌండేషన్ ద్వారా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఈమె తన కుటుంబంతో కలిసి గత ఏడాది యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వెటర్నరీ టీచింగ్ హాస్పిటల్‌కు ఏకంగా రూ.123 కోట్లు విరాళంగా అందించింది. ఇది యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.పక్కన వాళ్లకు రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచించే వ్యక్తులున్న ఈ రోజుల్లో ఏకంగా రూ. 123కోట్లు దానం చేశారంటే.. వారి ఉదారత అనన్య సామాన్యం. దీన్ని బట్టి చూస్తే వారి దాతృత్వం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది.ఇదీ చదవండి: 300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్షన్నా ఖాన్.. వోల్ఫ్ పాయింట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'జస్టిన్ మెక్‌కేబ్'ను వివాహం చేసుకుంది. ఈమె ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఈమె షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ లక్ష కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. షన్నా ఖాన్ నికర విలువ, విరాళాలు మొత్తం కలిపినా అంబానీ ఫ్యామిలీ అంత ఉండకపోయినా.. ఉదారంగా విరాళాలు అందించడంలో వీరికి వీరే సాటి. -
ప్రముఖ కంపెనీ మాజీ హెచ్ఆర్ హెడ్.. ఒడిశా అభ్యర్థుల్లో రిచెస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ మాజీ హెచ్ఆర్ హెడ్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నిలల్లో కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంతృప్త్ మిశ్రా సుమారు రూ. 461 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత గత ఫిబ్రవరిలో బీజేడీలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ 2021-22లో రూ. 76.23 కోట్లు, 2022-23లో రూ. 66.21 కోట్లుగా ఉన్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.408 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4 కోట్ల బ్యాంకు డిపాజిట్లు సహా రూ.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో మిశ్రా పెట్టుబడి మొత్తం ప్రస్తుత విలువ దాదాపు రూ. 308 కోట్లు. రూ.2.3 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన కార్లు ఆయనకున్నాయి. ఇక మిశ్రా భార్య చరాస్తుల విలువ రూ. 11.72 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఒడిశాలో ఎటువంటి స్థిరాస్తి లేనప్పటికీ, మిశ్రాకు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్, ముంబైలలో ఫ్లాట్లు ఉన్నాయి.కాగా ఒడిశాలో 21 లోక్‌స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటికీ ఏక కాలంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పోటీ చేసే కటక్ లోక్‌సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
‘స్టార్ చంద్రు’.. రెండో దశ పోలింగ్‌లో రిచ్ ఈయనే..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలు , కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 6 సీట్లు, అస్సాం, బీహార్లలో 5 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో మూడు సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది.అత్యంత ధనిక అభ్యర్థులు వీళ్లే..అభ్యర్థుల ఎలక్షన్ అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ చేసిన విశ్లేషణ ప్రకారం.. 'స్టార్ చంద్రు'గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణే గౌడ ఫేజ్ 2 పోలింగ్‌లో అత్యంత ధనవంతుడు. హెచ్డీ కుమారస్వామిపై పోటీ చేస్తున్న ఈయన రూ.622 కోట్ల ఆస్తులను ప్రకటించారు .ఇక రూ. 593 కోట్లతో రెండవ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్. ఈయన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు.మథుర లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని రూ. 278 కోట్ల ఆస్తులతో మూడో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉన్నారు.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన రూ.232 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు .కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ.217.21 కోట్లు.వీళ్లే పేద అభ్యర్థులుమహారాష్ట్రలోని నాందేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ఆయన కేవలం రూ.500 విలువైన ఆస్తులను ప్రకటించారు.రెండో స్థానంలో కేరళలోని కాసరగోడ్ నుండి పోటీ చేస్తున్న మరొక స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ రూ.1,000 విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అమరావతి (SC) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ప్రవేశించిన పృథ్వీసామ్రాట్ ముకిందరావ్ దీప్వాన్ష్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఈయన మొత్తం ఆస్తులు రూ.1,400. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న దళిత క్రాంతి దళ్ నాయకుడు షహనాజ్ బానో రూ. 2,000 ఆస్తులను ప్రకటించారు. కేరళలోని కొట్టాయం నుండి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) తరపున పోటీ చేస్తున్న వీపీ కొచుమోన్ రూ.2,230 ఆస్తులతో జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. -
First phase of Lok Sabha polls: ఈరోజు ఎన్నికల్లో ధనవంతులు వీళ్లే..
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతులు ఎవరు.. సున్నా ఆస్తులు ఉన్నవారు ఎంత మంది? వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ శుక్రవారం జరుగుతున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న 1,625 మంది అభ్యర్థులను 1,618 మందిని విశ్లేషించి వారి ఆస్తులపై ఓ నివేదికను విడుదల చేసింది. వీరిలో 10 మంది తమ ఆస్తులను సున్నాగా ప్రకటించారు. 450 మంది అభ్యర్థులు లేదా 28 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని విశ్లేషణలో తేలింది. మాజీ సీఎం కొడుకే టాప్ రూ.716 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్‌కు చెందిన నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడే ఈ నకుల్ నాథ్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు ఇదే. ఇక రూ. 662 కోట్లు ప్రకటించిన ఏఐఏడీఎంకేకు చెందిన అశోక్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. రూ. 304 కోట్ల విలువైన ఆస్తులతో బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. ఈయన తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కార్తీ చిదంబరం ఉన్నారు. చిదంబరం రూ.96 కోట్లతో నెట్‌వర్త్‌తో జాబితాలో పదో స్థానంలో ఉన్నారు . సున్నా ఆస్తులున్న వారు వీరే.. తొలి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో సున్నా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించినవారు 10 మంది ఉన్నారు. వీరిలో తమిళనాడులోని తూత్తుకుడి నుండి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్న పొన్రాజ్ కె తన వద్ద రూ. 320 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈయన తర్వాత మహారాష్ట్రలోని రామ్‌టెక్ నియోజకవర్గం, తమిళనాడులోని చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థులు కార్తీక్ గెండ్లాజీ డోక్, సూర్యముత్తులు రూ.500 ఆస్తులను ప్రకటించారు. -
బరిలో బాలీవుడ్ నటుడి సోదరుడు.. ఫస్ట్ ఫేజ్‌లో ఈయనే రిచ్!
Lok Sabha Elections 2024: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ నియోజకవర్గం నుంచి మాజిద్ అలీని బహుజన సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థిగా నిలిపింది. కేఆర్కేగా పిలిచే బాలీవుడ్ నటుడు, నిర్మాత కమాల్ ఆర్ ఖాన్ సోదరుడే మాజిద్ అలీ. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో మాజిద్ అలీ అత్యంత ధనవంతుడు. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. అలీ మొత్తం ఆస్తులు సుమారు రూ. 160 కోట్లుగా ప్రకటించారు. మాజిద్ అలీకి రియల్ ఎస్టేట్, మైనింగ్, క్వారీయింగ్, ఆహార ఉత్పత్తులు, దుస్తుల వ్యాపారాలు ఉన్నాయి. అవిసెన్నా స్టోన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తోదర్పూర్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మజిద్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్విజన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివి ఆయన నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు. మాజిద్ అలీ లోక్‌సభకు పోటీ చేయడం ఇదే తొలిసారి కాగా, ఆయన రాజకీయాలకు కొత్తేమీ కాదు. 2009లో బీఎస్పీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన 2016లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దేవ్‌బంద్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో ఆజాద్ సమాజ్ పార్టీలో చేరి వెంటనే తిరిగి బీఎస్పీకి వచ్చేశారు. -
ఈ ఏడాది ఈమే టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్అదానీ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే.. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈనెల 17న రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 253 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 958 మందికిగాను 953 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాలను విశ్లేషించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్(ఏడీఆర్)తెలిపింది. అభ్యర్థుల ఆస్తుల సరాసరి రూ.2 కోట్లని తెలిపింది. అత్యంత ధనికులైన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు చెందిన వారేనని పేర్కొంది. సుర్‌గ్రుజా రాచకుటుంబ వారసుడైన టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. అంబికాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఈయన 2018 ఎన్నికల సమయంలో రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మణేంద్రగఢ్ స్థానంలో పోటీ చేస్తున్న రమేశ్ సింగ్ రూ.73 కోట్ల పైచిలుకు ఆస్తులు, రజిమ్‌లో పోటీ చేస్తున్న అమితేశ్ శుక్లా రూ.48 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్లు ప్రకటించారని వెల్లడించింది. కాంగ్రెస్‌కు చెందిన 70 మంది అభ్యర్థుల్లో 60 (86%)మంది, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 (81%)మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే)కి చెందిన 62 మందిలో 26 (42%) మంది, ఆప్‌నకు చెందిన 44 మందిలో 19 (43%) మంది అభ్యర్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్లు ప్రకటించారని వివరించింది. ఆస్తులే లేవన్న ముగ్గురు అభ్యర్థులు భట్గావ్ సీటుకు పోటీ చేస్తున్న కళావతి సార్థి, బెల్టారాలో పోటీ చేస్తున్న గౌతమ్ ప్రసాద్ సాహు అనే స్వతంత్ర అభ్యర్థులు, ఖర్సియాలో పోటీలో ఉన్న జోహార్ ఛత్తీస్‌గఢ్ పార్టీకి చెందిన యశ్వంత్ కుమార్ నిషాద్ తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది. అదేవిధంగా, రెండో విడత ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు అతి తక్కువగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ముంగేలి ఎస్సీ రిజర్వుడు సీటుకు పోటీ చేస్తున్న నేషనల్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌రత్న ఉయికే తన వద్ద కేవలం రూ.500 ఉన్నట్లు తెలిపారు. రాయ్‌గఢ్‌లో ఆజాద్ జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న కాంతి సాహు రూ.1,000 మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా, బెల్టారా బరిలో నిలిచిన ఆజాద్ జనతా పార్టీకే చెందిన ముకేశ్ కుమార్ చంద్రాకర్ రూ. 1,500 ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ తెలిపింది. సీఎం బఘేల్‌కు అత్యధిక ఆదాయం ఆప్ అభ్యర్థి విశాల్ కేల్కర్, కాంగ్రెస్ నేత, సీఎం భూపేశ్ బఘేల్, బీజేపీ నేత ఓపీ చౌధరి తమకు అత్యధిక ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది. కేల్కర్ తన మొత్తం ఆదాయం రూ.2 కోట్లుగా, సీఎం బఘేల్, చౌధరిలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు చెప్పారు. 52 శాతం మంది 12వ తరగతిలోపే మొత్తం అభ్యర్థుల్లో 499(52 శాతం) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు తెలపగా మరో 405(42%)మంది గ్రాడ్యుయేషన్ ఆపైన చదువుకున్నట్లు వెల్లడించారని ఏడీఆర్ విశ్లేషించింది. 19 మంది అక్షరాస్యులమని మాత్రమే తెలపగా, ఆరుగురు నిరక్షరాస్యులమని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు విద్యార్హతలను పేర్కొనలేదు. -
ఆసియా అపర కుబేరుడు జాక్ మా!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రతకు ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకుంటాయన్న భయాలతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో .. పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మార్కెట్ పతనంలో ఆయన సంపద విలువ 5.8 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోవడం ఇందుకు కారణం. దీంతో 44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు మళ్లీ నంబర్‌వన్ స్థానంలో నిల్చారు. అంబానీ కన్నా ఆయన సంపద సుమారు 2.6 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. 2018 మధ్యలో జాక్ మా ఆసియాలో నంబర్ 1 హోదాను కోల్పోయారు. అపర కుబేరుల సంపద లెక్కించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఇది వెల్లడైంది. ‘చమురు’ వదులుతోంది... ముడి చమురు రేట్లు భారీగా పతనమైన నేపథ్యంలో రిలయన్స్ నిర్దేశించుకున్నట్లుగా 2021 నాటికి రుణరహిత సంస్థగా మారే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీకి రిలయన్స్ చమురు, పెట్రోకెమికల్స్ విభాగంలో వాటాల విక్రయ డీల్ సజావుగా జరగడంపైనే ఇదంతా ఆధారపడనుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మరోవైపు, కరోనా వైరస్ దెబ్బతో జాక్ మా ఆలీబాబా వ్యాపారం కాస్త దెబ్బతిన్నా.. ఆ గ్రూప్‌లోని క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ యాప్స్‌కి డిమాండ్ పెరగడంతో పెద్దగా ప్రతికూల ప్రభావం పడలేదు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి అలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. సోమవారం స్టాక్ మార్కెట్ పతనంలో రిలయన్స్ షేర్లు ఏకంగా 12 శాతం పడిపోయాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. -
ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతుడైన రమేశ్‌కుమార్ శర్మ డిపాజిట్ గల్లంతైంది. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని రూ.1,107 కోట్లుగా పేర్కొన్న రమేశ్‌కుమార్, బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు కేవలం 1,558 ఓట్లు మాత్రమే రావడంతో డి´జిట్‌ను కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు వచ్చినవి 0.14 శాతం ఓట్లు మాత్రమే. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామ్‌క్రిపాల్ యాదవ్ గెలుపొందారు. రామ్క్రిపాల్కు 5 లక్షల ఓట్లు(47.28 శాతం) రాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి 4.7 లక్షల ఓట్లతో (43.63 శాతం) రెండో స్థానంలో నిలిచారు. లోక్‌సభలో పోటీపడిన టాప్ 5 ధనవంతుల్లో రమేశ్‌కుమార్ మినహా మిగతా నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారిలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.895 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ రూ.660 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో, వసంతకుమార్ రూ.417 కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో, జ్యోతిరాదిత్య సింధియా రూ.374 కోట్ల ఆస్తితో ఐదో స్థానంలో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో 14,317 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని చిన్‌ద్వారా నియోజకవర్గంలో పోటీచేసి న నకుల్ నాథ్ 35 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తమిళనాడులోని కన్యాకుమా రి నియోజకవర్గంలో వసంతకుమార్ 3 లక్షల ఓట్ల మెజారిటీలో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో పోటీచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అభ్యర్థి క్రిష్ణపాల్ సింగ్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
ఈ అభ్యర్థికి రూ.690కోట్ల కళ్లు చెదిరే ఆస్తులు
ముంబయి: త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. అతడు నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు అతడు తెలిపిన తన ఆస్తుల విలువ అక్షరాల రూ.690కోట్లు. దీంతో ఈ ఏడాది జరుగుతున్న ఈ ఎన్నికల్లో అతడే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలవనున్నాడు. వివరాల్లోకి వెళితే.. పరాగ్ షా అనే వ్యక్తి ఘట్కోపార్ ప్రాంతం నుంచి బీఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగాడు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్నాడు. ఇతడు మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతాకు అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. ఇప్పటి వరకు రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోయినా.. ఒక్కసారిగా తన అనూహ్య ఆస్తులు ప్రకటించి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. సొంతంగా మేన్ కన్స్ట్రక్షన్స్, మేన్ డెవలపర్స్ పేరిట ముంబయితోపాటు గుజరాత్, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో ప్రాజెక్టు పనులు చేస్తుంటారు. ఈయన ఒక పెద్ద రియల్టర్ కూడా. రూ.670 కోట్లు చరాస్తులుగా, రూ.20 కోట్లు స్థిరాస్తులుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిల్లో కొన్ని తన భార్య పేరిట ఉన్నట్లు చెప్పాడు. -
ములాయం చిన్న కోడలి సంపదెంతో తెలుసా!?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడిన సంగతి తెలిసిందే. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆమె మూడో దఫా ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. సోమవారం ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. తనకు, తన భర్త ప్రతీక్ యాదవ్‌కు మొత్తం రూ. 22.95 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తమ ఆస్తుల్లో రూ. 5.23 కోట్లు విలువచేసే అత్యంత ఖరీదైన లాంబోర్గినీ వాహనం కూడా ఉందని వెల్లడించారు. ఇది తన భర్త పేరిట ఉందని, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనం లేదని పేర్కొన్నారు. తనకు రూ. 1.88 కోట్ల విలువచేసే నగలు ఉన్నాయని తెలిపారు. ఇక తన భర్త ప్రతీక్ రూ. 4.5 కోట్ల రుణాన్ని గోమతినగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ ఇండియా శాఖ నుంచి తీసుకున్నారని పేర్కొన్నారు. తన పేరిట ఎలాంటి పెట్టుబడులు, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు లేవని, కానీ తన భర్త రూ. 7.96 లక్షల విలువచేసే బీమా పాలసీలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి దంపతులిరువురు ఆదాయపన్ను చెల్లించినట్టు తెలిపారు. ఎస్పీలో తలెత్తిన ములాయం అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకొని ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. ఆమె ఈసారి బలమైన అభ్యర్థి రీటా బహుగుణ జోషీ (బీజేపీ)ని లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎదుర్కొంటుండటంతో అందరి చూపు ఇక్కడి పోటీపైనే నెలకొని ఉంది. -
నాడు 200.. నేడు 7700 కోట్లు!!
నందన్ నీలేకని.. ఆధార్ కార్డుల పుణ్యమాని దేశం మొత్తానికి తెలిసిన పేరిది. ఒకప్పుడు నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించిన వ్యవస్థాపకులలో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు లోక్‌సభకు పోటీ చేస్తున్న సందర్భంగా, తన ఆస్తుల విలువ 7,700 కోట్ల రూపాయలని ప్రకటించి సంచలనం సృష్టించారు. బహుశా ఈ ఎన్నికల్లో ఆయనకంటే ధనవంతుడైన అభ్యర్థి ఎవరూ ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, 1978లో ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ చదవిన తర్వాత ఉద్యోగావకాశం వస్తే తనకొద్దని విదిల్చికొట్టేనాటికి ఆయన జేబులో ఉన్నవి కేవలం 200 రూపాయలే!! అక్కడినుంచి ఇప్పుడు దాదాపు 8వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించే స్థాయికి ఎదిగారు. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నందన్ నీలేకనికి నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన కోరమంగళ వద్ద రిసార్టు లాంటి ఇల్లు, లెక్కలేనన్ని విలాసవంతమైన కార్లు.. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. తనకు ఇప్పటికే బోలెడంత డబ్బుందని, ఇప్పుడు డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రావట్లేదని నీలేకని అన్నారు. మార్పు తేవడం కోసమే వస్తున్నానన్నారు. తాను నిజాయితీగా సంపాదించానని, అంతా ప్రకటించానని చెప్పారు. నందన్ నీలేకని సంపాదనలో అత్యధిక భాగం ఆయనకు, ఆయన భార్య రోహిణికి ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్ల రూపంలోనే ఉంది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్‌లో వీళ్లిద్దరికీ కలిపి 3శాతం షేర్లున్నాయి.