వ్యాల్యూ కోరుకునే వారి కోసం | Aditya Birla Sunlife Pure Value Fund | Sakshi
Sakshi News home page

వ్యాల్యూ కోరుకునే వారి కోసం

Published Mon, May 21 2018 1:28 AM | Last Updated on Mon, May 21 2018 1:28 AM

Aditya Birla Sunlife Pure Value Fund - Sakshi

సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం: ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను చేకూర్చేందుకు ఈ పథకం ప్రయత్నిస్తుంటుంది. ప్రారంభించి పదేళ్లు పూర్తయింది. 2008 మార్చిలో ప్రారంభమైన ఈ పథకం... అన్ని సమయాల్లోనూ రాబడుల పరంగా మెరుగ్గానే ఉంది. లార్జ్‌ క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ వంటి వివిధ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో కూడిన స్టాక్స్‌ దీని పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. మార్కెట్‌ విలువతో సంబంధం లేకుండా వ్యాల్యూ ఉండి... కాస్త ఆర్షణీయంగా లభించే షేర్లను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటుంది.

గడిచిన పదేళ్లలో సగటున వార్షికంగా 20 శాతం చొప్పున రాబడులిచ్చిన పథకం ఇది. మిడ్‌క్యాప్‌ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఐడీఎఫ్‌సీ ప్రీమియర్‌ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఆపర్చునిటీస్, యూటీఐ మిడ్‌క్యాప్‌ పథకాల కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. అలాగే, వ్యాల్యూ ఫండ్స్‌ విభాగంలోని ఎల్‌ అండ్‌ టీ ఇండియా వ్యాల్యూ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాల్యూ డిస్కవరీ పథకాల కంటే కూడా 2– 7 శాతం మేర అధికంగా రిటర్నులివ్వటం గమనార్హం.

వ్యాల్యుయేషన్‌ ఫోకస్‌...
మిడ్‌క్యాప్‌ విభాగంలో విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న స్టాక్స్‌కు 40– 60 శాతం నిధుల్ని కేటాయించింది. లార్జ్‌ క్యాప్‌లో వ్యాల్యూ స్టాక్స్‌కు 20–30 శాతం పెట్టుబడులను కేటాయించింది. కెమికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఫైనాన్స్‌ స్టాక్స్‌ ఎక్కువగా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ స్టాక్స్‌ పట్ల కూడా సానుకూలంగానే ఉంది.

కెమిక్సల్‌ విభాగంలోని స్టాక్స్‌లో క్రమానుగతంగా ఎక్స్‌పోజర్‌ పెంచుకుంటూ వస్తోంది. అదే సమయంలో బ్యాంకు స్టాక్స్‌కు ప్రాధాన్యం తక్కువగానే ఇచ్చింది. అలాగే, మెరుగైన రాబడులను ఒడిసి పట్టుకునేందుకు ఎప్పటికప్పుడు పోర్ట్‌ఫోలియోలో మార్పులు కూడా చేస్తుంటుంది. బ్యాంకింగ్‌ స్టాక్స్‌ను పెద్దగా కొనుగోలు చేయకపోవడం వల్లే గతేడాది కాలంలో ఆ స్టాక్స్‌ పతనం అయినప్పటికీ పథకం రాబడులపై ప్రభావం పడలేదు.

పెట్టుబడుల విధానం
మొమెంటమ్‌ స్టాక్స్‌ వెంట పరుగులు తీసే విధానానికి దూరంగా ఉంటుంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరీటీల్లో ఇన్వెస్ట్‌ చేసే విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్లు పట్టించుకోని, వాస్తవ విలువ కంటే తక్కువకు లభించే స్టాక్స్‌పై ఫోకస్‌ పెడుతుంది. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో 40 నుంచి గరిష్టంగా 65 స్టాక్స్‌ వరకు ఉంటాయి.

అస్థిరతలు పెరిగితే డెట్‌ విభాగంలో 7–8 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. 7–10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయగలిగే వారికి ఈ పథకం అనువుగా ఉంటుం ది. ఇటీవల సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో మార్పులకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా బిర్లా సన్‌లైఫ్‌ ప్యూర్‌ వ్యాల్యూ ఫండ్‌ పేరుతోపాటు పెట్టుబడుల స్ట్రాటజీ కూడా మారలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement