: హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై మరో నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఉత్తరాఖండ్, తమిళనాడులో మూడు నెలలు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు గురువారం ప్రకటించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టంచేశాయి.