భాగ్యనగర వాసుల మెట్రో కల సంపూర్ణమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో నెరవేరింది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్ పూర్తయ్యింది. 2008 మే 14న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగర మెట్రోప్రాజెక్ట్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.