ఏపీలో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం
హైదరాబాద్: మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఏపీలో మ్యాగీ నూడుల్స్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.
మ్యాగీ నూడుల్స్ కు సంబంధించి సరఫరా, అమ్మకాలు జరపరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఆహారభద్రత అధికారాలు మ్యాగీ నూడుల్స్ పై తాజా ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు. కాగా, మ్యాగీ సరఫరా చేసే తొమ్మిదిరకాల ఉత్పత్తులను వెనక్కితీసుకోమని చెప్పినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.