
డబ్బుతో కొనలేని థింగ్స్ ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నారు కథానాయిక లావణ్యా త్రిపాఠి. ‘ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు’ అన్న ఓ నెటిజన్ కామెంట్‌కు ఆమె బదులిస్తూ.. ‘‘ఇంటెలిజెన్స్‌ని డబ్బుతో కొనలేమని ష్యూర్‌గా చెప్పగలను’’ అన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా టీఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు లావణ్య. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సీఎస్.