
సాక్షి, తాడేపల్లి: రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గించామని పేర్కొన్నారు. అధిక వర్షాలతో కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటివరకూ 2,36,880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 7వేలకు పైగా ఆర్బీకేలలో ధాన్యం సేకరణ ఏర్పాటు చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
చదవండి: మాయలేడి: ఇంట్లోకి వచ్చి ఎంత పని చేసిందంటే..!
Comments
Please login to add a commentAdd a comment