
ముంబై: వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. మన దేశంలోని 37 శాతం మంది ఇంత వరకు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయలేదట. ప్రపంచ స్వర్ణ మండలి సంస్థ (డబ్ల్యూజీసీ) ఒక సర్వే చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. కాకపోతే భవిష్యత్తులో బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు వారు చెప్పారు. ‘‘37 శాతం మంది మహిళలు కొనుగోలు సామర్థ్యంతో ఉన్నారు. బంగారం ఆభరణాల పరిశ్రమకు వారు కొత్త వినియోగదారులు కానున్నారు.
వీరిలో 44 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 30 శాతం మంది పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు’’ అని డబ్ల్యూజీసీ భారత ఆభరణాల పరిశ్రమపై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మన దేశ మహిళలకు బంగారం ఆభరణాలు మొదటి ప్రాధాన్యమన్న విషయం తెలిసిందే. బంగారం మన్నిౖMðనదే కాకుండా, చక్కని పెట్టుబడి సాధనమని, కుటుంబ వారసత్వ సంపదంటూ.. మహిళలకు ఇది చక్కని ఎంపిక అని ఈ సర్వే పేర్కొంది. అయితే, నేటి యువ మహిళల అవసరాలను పసిడి తీర్చలేకపోతుందని తెలిపింది. ఇక 18–24 ఏళ్ల వయసున్న భారతీయ మహిళలలో 33 శాతం మం ది గడిచిన ఏడాది కాలంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment