Gold Jewelery purchases
-
అక్షయ.. అద్భుతం (ఫొటోలు)
-
పసిడి ‘ధనత్రయోదశి’ ధగధగలు
ముంబై: ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. కరోనా కారణంగా గతేడాది డిమాండ్ తగ్గగా.. ఈ ఏడాది పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. కొనుగోళ్లకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు చెప్పాయి. ఆన్లైన్ విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. 15 టన్నుల ఆభరణాలు.. జ్యుయలరీ పరిశ్రమ కరోనా మహమ్మారి నుంచి కోలుకుందని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా రూ.7,500 కోట్ల విలువ మేర సుమారు 15 టన్నుల బంగారం ఆభరణాలు విక్రయాలు ధనత్రయోదశి రోజున నమోదయ్యాయి’’ అని తెలిపింది. గత డిమాండ్ తోడవ్వడం, ధరలు అనుకూలంగా ఉండడం, లాక్డౌన్ ఆంక్షలు సడలిపోవడం డిమాండ్‌కు మద్దతునిస్తాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈవో సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత త్రైమాసికం ఇటీవలి సంవత్సరాల్లోనే బంగారానికి అత్యంత మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ధనత్రయోదశి సందర్భంగా బంగారానికి డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉందని పీసీ జ్యుయలర్స్ ఎండీ బలరామ్‌గార్గ్ సైతం తెలిపారు. గతేడాదితో పోలిస్తే డిమాండ్ రెట్టింపైనట్టు ఆగ్మంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొథారి పేర్కొన్నారు. 20–30 టన్నుల మేర.. ‘‘బంగారం ధరలు 2019తో పోలిస్తే పెరిగినప్పటికీ.. కరోనా ముందు నాటి స్థాయికి విక్రయాలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాము’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆవిష్ పెథే తెలిపారు. ఏటా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల బంగారం అమ్ముడుపోతోందని.. ఈ ఏడాది విక్రయాలు కొంచెం అధికంగానే ఉంటాయని పరిపరిశ్రమ వరా>్గలు వెల్లడించాయి. బంగారం ధరలు తులం రూ.57,000 స్థాయి వరకు వెళ్లి దిగి రావడం కూడా డిమాండ్‌కు కలిసొచ్చింది. ఢిల్లీలో బంగారం 10 గ్రాముల ధర రూ.47,644 (పన్నులు కాకుండా) పలికింది. అయితే 2020 ధనత్రయోదశి రోజున ఉన్న ధర రూ.39,240తో పోలిస్తే కాస్త పెరగడం గమనార్హం. బుధవారం ఉదయం వరకు త్రయోదశి తిథి ఉన్నందున ఆ రోజు కూడా బంగారం కొనుగోళ్లు కొనసాగనున్నాయి. హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలే కొనండి హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వద్ద నమోదైన వర్తకులకు చెందిన దుకాణాల్లో మాత్రమే హాల్‌మార్క్ ఆభరణాలను, కళాఖండాలను కొనుగోలు చేయాల్సిందిగా వినియోగదార్ల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ‘బిల్లు/ఇన్వాయిస్ తప్పనిసరిగా తీసుకోవాలి. హాల్‌మార్క్ ఆభరణాల విక్రయ బిల్లు, ఇన్వాయిస్లో.. ప్రతి ఆభరణం తాలూకు ప్రత్యేక వివరణ, విలువైన లోహం నికర బరువు, క్యారెట్లో స్వచ్ఛత, హాల్‌మార్కింగ్ రుసుమును సూచిస్తుంది’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో 2021 జూన్ 23 నుంచి 14, 18, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
నగల కొనుగోళ్లపై ‘పాన్’ పిడుగు!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలను రూ.2 లక్షలకు మించి కొనుగోలు చేస్తుంటే కేవైసీ వివరాలు ఇవ్వాలన్నది నిబంధన. అయితే, ఆభరణాల విక్రయదారులు (జ్యుయలర్స్) రూ.2 లక్షల్లోపు కొనుగోళ్లకూ కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ అడగడం మొదలు పెట్టేశారు. రానున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీని తప్పనిసరి చేయవచ్చని వర్తకులు భావిస్తున్నారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి జ్యుయలరీ పరిశ్రమను తీసుకొచ్చినందున.. భవిష్యత్తులో ఏవైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తించినట్టయితే తమపై కఠినచర్యలు తీసుకోవచ్చన్న భయం వర్తకుల్లో నెలకొని ఉంది. బంగారం మినహా ఇతర అన్ని రకాల పెట్టుబడి సాధనాలకూ కేవైసీ తప్పనిసరిగా అమల్లో ఉంది. బంగారానికి వస్తే రూ.2 లక్షలకు మించిన కొనుగోళ్లకే కేవైసీ ప్రస్తుతం అమల్లో ఉంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మాదిరే బంగారాన్నీ పెట్టుబడి సాధనంగా గుర్తించాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉందని.. ఇందుకోసం సమగ్రమైన బంగారం విధానాన్ని తీసుకురానుందని జ్యుయలరీ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా మన దేశం 800–850 టన్నుల బంగారాన్ని వినియోగిస్తోంది. వివరాలను వెల్లడించాల్సిందే.. ఖరీదైన మెటల్స్, ఖరీదైన స్టోన్స్ డీలర్లను పీఎంఎల్ఏ కిందకు తీసుకురావడంతో.. బంగారం, వెండి, ప్లాటినమ్, వజ్రాలు, ఇతర రాళ్లను విక్రయించే జ్యుయలర్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు లావాదేవీల వివరాలను వెల్లడించాల్సి వస్తుందంటూ ‘ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్’ (ఐబీజేఏ) జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు. పీఎంఎల్ఏ కిందకు బంగారాన్ని గత డిసెంబర్ 28 నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిందని.. దీంతో బంగారం ఆభరణాల వర్తకులు అనుమానిత లావాదేవీల వివరాలను, ఒక నెలలో రూ. 10 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల వివరాలను ప్రభుత్వ అధికారులకు నివేదించాల్సి ఉంటుందని మెహతా చెప్పారు. ‘‘కుటుంబ సభ్యుల కోసం రూ.2 లక్షల్లోపు కొనుగోలు చేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పటివరకు అభిప్రాయం ఉంది. అయితే, ప్రభుత్వ ఏజెన్సీలు మరింత కఠినంగా వ్యవహరించడం ద్వారా.. అన్ని లావాదేవీల వివరాలను అనుసంధానించి జ్యుయలర్లపై చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆభరణాల పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అధిక విలువ కొనుగోళ్లకే కేవైసీ పరిమితం: ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: అన్ని రకాల బంగారం కొనుగోళ్లకు కేవైసీ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అధిక విలువ కలిగిన బంగారం, వెండి, జెమ్స్ కొనుగోళ్లకు చేసే నగదు చెల్లింపులకు కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీఎమ్ఎల్ఏ చట్టం కిందకు తమనూ చేర్చడంతో అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీ తప్పనిసరి చేయవచ్చని ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. డిసెంబర్ 28న వచ్చిన నోటిఫికేషన్‌పై కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం స్పందించింది. ‘‘నగదు రూపంలో ఆభరణాలు, బంగారం, వెండి, ఖరీదైన జెమ్స్, రాళ్ల విలువ రూ.2లక్షలు మించి కొనుగోళ్లు ఉంటే కేవైసీ ఇవ్వాలన్నది గత కొన్నేళ్ల నుంచి అమల్లో ఉన్నదే. పీఎమ్ఎల్ యాక్ట్, 2002 చట్టం కింద డిసెంబర్ 28 నాటి నోటిఫికేషన్.. వ్యక్తులు లేదా సంస్థలు బంగారం, వెండి, జ్యుయలరీ, ఖరీదైన రాళ్లను రూ. 10లక్షలు, అంతకుమించి కొనుగోలు చేస్తే కేవైసీ డాక్యుమెంట్లు అవసరం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)లో భాగమే ఇది’’ అని తెలిపింది. -
37% మహిళల వద్ద బంగారం లేదు
ముంబై: వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. మన దేశంలోని 37 శాతం మంది ఇంత వరకు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయలేదట. ప్రపంచ స్వర్ణ మండలి సంస్థ (డబ్ల్యూజీసీ) ఒక సర్వే చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. కాకపోతే భవిష్యత్తులో బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు వారు చెప్పారు. ‘‘37 శాతం మంది మహిళలు కొనుగోలు సామర్థ్యంతో ఉన్నారు. బంగారం ఆభరణాల పరిశ్రమకు వారు కొత్త వినియోగదారులు కానున్నారు. వీరిలో 44 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 30 శాతం మంది పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు’’ అని డబ్ల్యూజీసీ భారత ఆభరణాల పరిశ్రమపై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మన దేశ మహిళలకు బంగారం ఆభరణాలు మొదటి ప్రాధాన్యమన్న విషయం తెలిసిందే. బంగారం మన్నిౖMðనదే కాకుండా, చక్కని పెట్టుబడి సాధనమని, కుటుంబ వారసత్వ సంపదంటూ.. మహిళలకు ఇది చక్కని ఎంపిక అని ఈ సర్వే పేర్కొంది. అయితే, నేటి యువ మహిళల అవసరాలను పసిడి తీర్చలేకపోతుందని తెలిపింది. ఇక 18–24 ఏళ్ల వయసున్న భారతీయ మహిళలలో 33 శాతం మం ది గడిచిన ఏడాది కాలంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. -
అక్షయ.. అద్భుతం
-
పతనం దిశగా బంగారం ధర
అంతర్జాతీయంగా మార్కెట్ బలహీనంగా ఉండటం, బంగారు ఆభరణాల కొనుగోళ్లు తగ్గడం వంటి కారణాల వల్ల భారత్‌లో బంగారం ధర క్షీణించింది. గతవారం 10 గ్రాముల బంగారం ధర రూ.27,000ల దిగువకు పడిపోయి, చివరకు రూ.725 తగ్గి రూ.26,700 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం ధర 2.9 శాతం తగ్గుదలతో ఔన్స్ 1,127 డాలర్లుగా ఉంది. దేశ రాజధానిలో గతవారం ప్రారంభంలో రూ. 27,575గా ఉన్న 99.9 స్వచ్ఛత బంగారం ధర వారాంతానికి రూ.26,700కు తగ్గింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.27,425 నుంచి రూ.26,550కు క్షీణించింది. గతవారం ముగింపు ఆగస్ట్ 29న రక్షా బంధన్ సందర్భంగా బులియన్ మార్కెట్ సెలవు. చైనా సంక్షోభం, కరెన్సీ ఒడిదుడుకులు, అమెరికా రిజర్వు ఫెడ్ రేట్ల పెంపు అంచనాలు వంటి అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేశాయని విశ్లేషకులు పేర్కొన్నారు.