![Beware Of Buying Vehicles - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/24/bike.jpg.webp?itok=JQ9b5BSX)
ప్రతీకాత్మక చిత్రం
ఖిలా వరంగల్ : సెకండ్ హ్యాండ్, కొత్త వాహనాల కొనుగోలు చేసేటపుడు వినియోగదారులు అత్యంత జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొన్నప్పుడు ఆర్‌సీబుక్, ఇన్సూరెన్స్, రోడ్డు టాక్స్ వంటి వాటిని సరి చూసుకోకుంటే వినియోగదారుడికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొత్తవి కొన్నప్పుడు చాసీస్ నెంబర్, తయారీ తేది ఇతర వివరాలు సరిచూసుకోవాలి. పాత వాహనాలైతే ఏ జిల్లాకు చెందినవి, ఎవరిపేరుపై ఉన్నాయి.
ఎన్ని కిలో మీటర్లు తిరిగాయి, తయారీ తేది, ఇతర వివరాలు తెలుసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కొంత మంది నేరగాళ్లు హత్యలు, దోపీడీలకు వినియోగించిన వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా ఇతర జిల్లాల్లోకి తీసుకెళ్లి ఆమ్మేయడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది. వాటిని కొనుగోలు చేసిన ఆమాయకులు చిక్కుల్లో పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలా సెకండ్ వాహనాలు కొనుగోలు చేసేటపుడు ఆర్టీఏ, ట్రాఫిక్ ఆధికారులను సంప్రదించి కేసుల వివరాలు సేకరించి సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయాలని ఆధికారులు హెచ్చరిస్తున్నారు.
వాహనాల వివరాల కోసం తెలంగాణ ట్రాన్స్‌ఫోర్ట్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి వాహనం నంబర్ ఎంటర్ చేయగానే పేరు, అడ్రస్ ఇతర వివరాలు వస్తాయి. వాటి ఆధారంగా బైక్ లేదా కారు ఎక్కడైనా దొంగతనం కాగానే వాహనదారుడి పేరు, ధృవీకరణ పత్రం, ఇన్సూరెన్స్ పత్రాల పరిశీలనతోనే తెలిసిపోతుంది. కానీ ధృవీకరణ పత్రాలు ఏక్కడైనా మార్పింగ్ జరిగినట్లు అనిపిస్తే వెంటనే ఆర్టీఏను సంప్రదిస్తే వాహన వివరాలు తెలుసుకోవచ్చు.
అతివేగంగా వాహనాలు నడిపిన వారికి, ప్రమాదం చేసి తప్పించుకొని తిరుగుతున్నా వాహనాల వివరాలు కేసు నమోదును బట్టి తెలిసిపోతుంది. సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు పాటించకుంటే కష్టాలు తప్పవని రవాణాశాఖ ఆధికారులు హెచ్చరిస్తున్నారు. వాహన కొనుగోలు చేసే ముందు ఆర్టీఏ, ట్రాఫిక్ ఆధికారులను సంప్రదించి వాహనం కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పత్రాలు సరిచూసుకోవాలి కంచి వేణు డీటీఓ వరంగల్
సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ధృవీకరణ పత్రాలు సరిచూసిన వెంటనే ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించి వాహన వివరాలను తెలుసుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్‌తో పేరు మార్పిడి జరుగుతుంది. వాహనం అమ్మేవారు సైతం వెంటనే కొనుగోలుదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగేలా ఒత్తిడి చేయాలి. వాహనం కొనాలన్నా, విక్రయించాలన్నా ఆర్టీఏ నిబంధనాలు పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment