
లాభాల్లో మార్కెట్లు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ఆరంభంలో134 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 28,356 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 8,746 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభపడగా, ఐటీ ఫ్లాట్ గా ఉంది. ప్రధానంగా రియల్టీ, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ఎస్ బ్యాంక్, టీసీఎస్, హిందాల్కో, బజాజ్ ఆటో, కోల్ ఇండియా లాభపడుతుండగా, ఐడియా నష్టాల్లో ట్రేడవుతోంది.
అటు డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ బలంగా ఉంది. 0.12 పైసల లాభంతో 66. 49 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి10 గ్రా. 153 రూపాయల నష్టంతో 31,175 వద్ద ఉంది.