సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మరింత పుంజుకున్న కీలక సూచీ సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 33 పాయింట్లు ఎగిసి 10450 వద్ద కొనసాగుతోంది. ఫార్మ, బ్యాంకింగ్. ఐటీ సెక్టార్లు పాజిటివ్‌గా ఉన్నాయి. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ సిప్లా టాటా స్టీల్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంకు లాభపడుతుండగా, టాటామోటార్స్, జెట్ ఎయిర్‌వేస్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌పీసీఎల్, హెచ్‌యూఎల్, ఇండస్ ఇండ్, గెయిల్, అల్ట్రాటెక్ నష్టపోతున్నాయి.
మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కొద్దిగా తేరుకుంది. నిన్నటి నష్టాలతో పోలిస్తే 12 పైసలు పుంజుకుని 68.34 వద్ద కొనసాగుతోంది. ఇక ఎంసీఎక్స్ మార్కెట్‌లో పుత్తడి కూడా 10 గ్రా. 82 రూపాయలు లాభంతో 31,190 వద్ద పాజిటివ్‌గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment