సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 155 పాయింట్ల లాభంతో 35,598 వద్ద నిఫ్టీ 47పాయింట్లు ఎగిసి 10, 814 వద్ద ఉత్సాహగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,800 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. దాదాపు అన్ని రంగాలులాభాల్లో కొనసాగుతున్నాయి. ఫార్మా, మెటల్, రియల్టీ సెక్టార్ లాభాలను మరింత ఊతమిస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ షేర్లలో కూడా లాభాలే. హెచ్‌డీఎల్, యునైటెడ్ బ్రెవరేజెప్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, ఆర్‌ఐఎల్, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, యస్‌బ్యాంక్ లాభాల్లోనూ, యాక్సిస్, ఐసీఐసీఐ, యూపీఎల్, పీవీఆర్ సినిమాస్ స్వల్ప నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment