సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అటు కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం, ఇటు గ్లోబల్ సంకేతాల నేపథ్యంలో కీలక సూచీలు ఉత్సాహంగా ప్రారంభమైనాయి. అయితే ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. సెంచరీ లాభాలతో మొదలైన సెన్సెక్స్ ప్రస్తుతం 12 పాయింట్ల లాభంతో 35400 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 10749 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్నిసెక్టార్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మ, బ్యాంకింగ్ సెక్టార్ నష్టాలనుంచి కోలుకుంది. మెటల్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ లాభపడుతోంది. కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, విప్రో, సన్‌ఫార్మా లాభపడుతున్నవాటిలో ఉన్నాయి. ఆర్‌కాం, డా .రెడ్డీస్,రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ నష్టపోతున్నాయి. అటు కరెన్సీ మార్కెట్‌లో రుపీ పాజిటివ్‌గా ప్రారంభమైంది. డాలర్‌మారకంలో 7 పైసలు పుంజుకుని 67.72 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment