సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా జోష్‌గా ముగిశాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ సంకేతాలు, శుభప్రదమైన వాతావరణ అంచనాలు నేపథ్యంలో ఇన్వెసర్లు ఉత్సాహంగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 284 పాయింట్ల లాభంతో 35,463 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 10,768 వద్ద స్థిరపడింది. భారీ కొనుగోళ్లతో ఒకదశలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు జంప్‌చేసి 35,575 స్థాయిని, నిఫ్టీ 10,800ని తాకింది. దాదాపు అన్ని రంగాల్లోనే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రియల్టీ, మెటల్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ బాగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా, యునైటెడ్ బ్రెవరేజేస్ టాప్ విన్నర్స్‌గా ఉండగా టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఏషియన్ పెయింట్స్, విప్రో, యూపీఎల్, ఆర్‌ఐఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఉత్సాహంగా ముగిశాయి. మరోవైపు టైటన్, బ్లూ డార్ట్ ఐషర్ టాప్‌లూజర్‌గా ఉన్నాయి. ఇంకా ఇండస్‌ఇండ్, కోల్ ఇండియా, లుపిన్ స్వల్పంగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment