నెదర్లాండ్స్‌కు చెందిన ఒక మహిళ ఇటీవల తన చిన్న కుమారుడు తనకు తెలియకుండానే డార్క్ వెబ్‌లో ఎకె-47ను కొనుగోలు చేశాడని వెల్లడించింది. ‘నా కుమారుడు ఎనిమిదేళ్ల వయసులోనే హ్యాకింగ్ ప్రారంభించాడు. వాడు తుపాకీని ఆర్డర్ చేసినప్పుడు ఈ విషయాన్ని గ్రహించానని బార్బ్రా జెమెన్ అనే నెదర్లాండ్ మహిళ యూరోన్యూస్‌కు తెలిపారు. ‘మా వాడు కంప్యూటర్‌లో అధిక సమయం గడపడం ప్రారంభించాడు ఇంటర్నెట్‌లో ఉచితంగా లభించే వస్తువులను ఆర్డర్ చేయడం మొదలు పెట్టాడన్నారు. డార్క్ వెబ్‌లో కొనుగోళ్లు అనేవి ఉచిత పిజ్జా వంటి చిన్న వాటితో మొదలవుతాయని, క్రమంగా ఈ డెలివరీలు మరింత భయంకరంగా మారుతాయని’ ఆమె తెలిపింది.
‘మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించారు’
జెమెన్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె కుమారుడు ఇంటర్నెట్‌లో పలు రకాల కోడ్ పదబంధాలను ఉపయోగిస్తాడు. ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా మోసగాళ్లతో కమ్యూనికేట్ అవుతూ, వివిధ వ్యవహారాలను కొనసాగిస్తాడు. హ్యాకర్లు తన కుమారుడిని మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించారని జెమెన్ ఆరోపించింది. మందుగుండు సామాగ్రితో పాటు ఆటోమేటిక్ తుపాకీ ఆమె ఇంటి గుమ్మం వద్ద కనిపించే సరికి ఆమె తన కుమారుడు ఏమి చేస్తున్నాడో గ్రహించింది. తుపాకీని ఎలా ఆర్డర్ చేయాలో.. దానిని ఇంటికి ఎలా తెప్పించాలో తెలుసుకునేందుకు తన కుమారుడు ఒక నెల రోజులు వెచ్చించాడని అనుకుంటున్నానని జెమెన్ పేర్కొన్నారు. తన కుమారుడు పోలాండ్ నుండి బల్గేరియాకు తుపాకీని తెప్పించాడని ఆమె తెలిపింది. తన కుమారుడు ఇంటికి వచ్చిన పార్సిల్ తెరిచాడు. ఇంటికి తుపాకీని డెలివరీ చేయగలిగానని సంతోషపడ్డాడని ఆమె తెలిపింది. వాడి తీరు చూసి షాక్ అయ్యానని, వెంటనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుని, తుపాకీని స్థానిక పోలీసు విభాగానికి అప్పగించానని, దీంతో తన కుమారునిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని జెమెన్ చెప్పారు.
అంతర్జాతీయ హ్యాకర్ల బృందంతో..
జెమెన్ తన కుమారుని వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును గమనించింది. వాడు కంప్యూటర్ ముందు అత్యధిక సమయం కూర్చోవడంతోపాటు రాత్రంతా మేల్కోవడాన్ని ఆమె గుర్తించింది. తన కుమారుడు ఒత్తిడికి గురయ్యాడని, అంతర్జాతీయ హ్యాకర్ల బృందంతో కలిసి పని చేస్తున్నాడని జెమెన్ తెలుసుకుంది. తన కుమారుని నేరపూరిత జీవితాన్ని నిలువరించేందుకు కుమారుడు చదువున్న పాఠశాలను సంప్రదించింది. అక్కడ ఆమెకు ఆశించిన ఫలితం కనిపించలేదు. జెమెన్ తన కుమారుని బ్రౌజింగ్ హిస్టరీని చూసి, ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీకి తెలియజేయాలని నిర్ణయించుకుంది.
‘తప్పుదారి పట్టేందుకు అవకాశాలు అనేకం’
కంపెనీలను హ్యాక్ చేయడానికి, దొంగిలించిన సమాచారాన్ని వారికి పంపడానికి సహాయం చేయాలని తన కుమారుడిని అతని హ్యాకర్ స్నేహితులు అడిగారని జెమెన్ తెలిపింది. వెంటనే ఆమె తన కుమారునికి రక్షణ కల్పిస్తూ, వారితో సంబంధాన్ని తెంచుకోవడంలో అతనికి సహాయపడింది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ల్యాప్‌టాప్‌లు,సెల్ ఫోన్‌లను కలిగి ఉన్నారని, వారు తప్పుదారి పట్టేందుకు అవకాశాలు అనేకం ఉన్నాయని ప్రస్తుతం డచ్ పోలీసులతో సైబర్ స్పెషల్ వాలంటీర్‌గా పనిచేస్తున్న జెమెన్ తెలిపారు. చాలామందికి ఏది చట్టపరమైనది.. ఏది చట్టవిరుద్ధమో తెలియదని ఆమె తెలిపింది. జెమెన్ ఇటీవలే ప్రారంభమైన సైబర్ అఫెండర్ ప్రివెన్షన్ స్క్వాడ్ అనే డచ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి పనిచేస్తోంది.
ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో విడాకుల కేసులు అధికం!
హవ్వ.. గన్ను కొనడం ఇంత సులభమా?
Published Tue, Jul 25 2023 8:09 AM | Last Updated on Tue, Jul 25 2023 9:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment