![Bain Capital in Sai Life Sciences share race - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/26/Untitled-2.jpg.webp?itok=_cKluz0C)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్ట్ రిసర్చ్, డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలు రేసులో యూఎస్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ ముందు వరుసలో నిలిచినట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా సాయి లైఫ్ సైన్సెస్ నుంచి టీపీజీ క్యాపిటల్ పూర్తిగా తప్పుకోనుంది. అలాగే ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారు.
ప్రమోటర్ గ్రూప్ సైతం తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించినట్టయితే బెయిన్ క్యాపిటల్ నియంత్రణలోకి సాయి లైఫ్‌సైన్సెస్ వెళుతుంది. సాయి లైఫ్ సైన్సెస్‌లో టీపీజీ క్యాపిటల్‌కు 43.4 శాతం, హెచ్‌బీఎం ప్రైవేట్ ఈక్విటీ ఇండియాకు 6 శాతం, మిగిలిన వాటా ప్రమోటర్లకు ఉంది. డీల్ ద్వారా సాయి లైఫ్ సైనెŠస్‌స్‌ను రూ.6,650 కోట్లుగా విలువ కట్టినట్టు తెలుస్తోంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్, కేకేఆర్, చార్లెస్ రివర్ సైతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచాయి.
Comments
Please login to add a commentAdd a comment