tpg
-
కేర్ హాస్పిటల్స్, ఆస్టర్ డీఎం విలీనం
న్యూఢిల్లీ: వైద్య సేవల దిగ్గజాలు ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా (కేర్ హాస్పిటల్స్) విలీనం కానున్నాయి. తద్వారా ఆదాయం, పడకల సంఖ్యపరంగా దేశీయంగా మూడో అతి పెద్ద హాస్పిటల్ చైన్ ఆవిర్భవించనుంది. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. డీల్ ప్రకారం క్వాలిటీ కేర్ ఇండియాలో (క్యూసీఐఎల్) పెట్టుబడులున్న బ్లాక్‌స్టోన్, టీపీజీల నుంచి ఆస్టర్ 5% వాటాలను కొనుగోలు చేస్తుంది. ప్రతిగా తమ సంస్థలో 3.6% వాటాకు సమానమైన షేర్లను జారీ చేస్తుంది. తదుపరి ఆస్టర్‌లో క్యూసీఐఎల్ని విలీనం చేస్తారు. లిస్టెడ్ విలీన సంస్థ పేరు ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్‌గా మారుతుంది. రిజిస్టర్డ్ కార్యాలయాన్ని కర్ణాటక నుంచి తెలంగాణకు మారుస్తారు. ‘ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదు’ అని ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆజాద్ మూపెన్ ఈ సందర్భంగా తెలిపారు. ‘విలీన సంస్థ భారత హెల్త్‌కేర్ రంగంలో అగ్రగామిగా, ప్రపంచ స్థాయి సంస్థగా ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాం’ అని బ్లాక్‌స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా హెడ్ అమిత్ దీక్షిత్ వివరించారు. చైర్మన్‌గా ఆజాద్ మూపెన్.. విలీన కంపెనీలో ఆస్టర్ ప్రమోటర్లకు 24 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 30.7 శాతం వాటాలుంటాయి. షేర్ల మారి్పడి నిష్పత్తి ప్రకారం విలీన కంపెనీలో ప్రమోటర్లతో కలిపి ఆస్టర్ షేర్హోల్డర్లకు 57.3%, క్యూసీఐఎల్ షేర్హోల్డర్లకు 42.7% వాటా ఉంటుంది. క్యూసీఐఎల్ షేర్హోల్డర్లకు ప్రతి 1,000 షేర్లకు గాను 977 ఆస్టర్ షేర్లు లభిస్తాయి. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ఫౌండర్, చైర్మన్ ఆజాద్ మూపెన్ .. మూడేళ్ల ఆరు నెలల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. మరోవైపు, క్యూసీఐఎల్ గ్రూప్ ఎండీ వరుణ్ ఖన్నా.. ఎండీ, గ్రూప్ సీఈవోగా ఉంటారు. 38 ఆస్పత్రులు.. 10 వేల పైగా బెడ్స్.. విలీన సంస్థ 27 నగరాల్లో 38 ఆస్పత్రులు, 10,150 పడకలతో దేశీయంగా మూడో అతి పెద్ద హాస్పిటల్ చెయిన్‌గా ఉంటుంది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఆస్టర్ డీఎం ఇచి్చన సమాచారం ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారుగా మరో 3,500 పడకలను పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయి. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ కింద నాలుగు బ్రాండ్లు (ఆస్టర్ డీఎం, కేర్ హాస్పిటల్స్, కిమ్స్‌హెల్త్, ఎవర్‌కేర్) ఉంటాయి. ప్రస్తుతం అపోలో గ్రూప్, మణిపాల్ హాస్పిటల్స్ టాప్ 3లో ఉన్నాయి. శుక్రవారం బీఎస్ఈలో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ షేరు సుమారు 2 శాతం పెరిగి రూ. 499.95 వద్ద క్లోజయ్యింది. -
సాయి లైఫ్ సైన్సెస్ వాటా రేసులో బెయిన్ క్యాపిటల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్ట్ రిసర్చ్, డెవలప్మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలు రేసులో యూఎస్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ ముందు వరుసలో నిలిచినట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా సాయి లైఫ్ సైన్సెస్ నుంచి టీపీజీ క్యాపిటల్ పూర్తిగా తప్పుకోనుంది. అలాగే ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారు. ప్రమోటర్ గ్రూప్ సైతం తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించినట్టయితే బెయిన్ క్యాపిటల్ నియంత్రణలోకి సాయి లైఫ్‌సైన్సెస్ వెళుతుంది. సాయి లైఫ్ సైన్సెస్‌లో టీపీజీ క్యాపిటల్‌కు 43.4 శాతం, హెచ్‌బీఎం ప్రైవేట్ ఈక్విటీ ఇండియాకు 6 శాతం, మిగిలిన వాటా ప్రమోటర్లకు ఉంది. డీల్ ద్వారా సాయి లైఫ్ సైనెŠస్స్ను రూ.6,650 కోట్లుగా విలువ కట్టినట్టు తెలుస్తోంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్, కేకేఆర్, చార్లెస్ రివర్ సైతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచాయి. -
వృద్ధి బాటలో గృహం హౌసింగ్
ముంబై: దేశీ అనుబంధ సంస్థ గృహమ్ హౌసింగ్ వృద్ధి బాటలో సాగుతున్నట్లు ప్రత్యామ్నాయ ఆస్తుల నిర్వహణ దిగ్గజం టీపీజీ క్యాపిటల్ తాజాగా పేర్కొంది. పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ మార్చికల్లా రూ. 8,200 కోట్ల నిర్వహణ ఆస్తులను(ఏయూఎం) చేరుకోనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే సంస్థ ఏయూఎం రూ. 7,500 కోట్లను అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరేళ్లలో సంస్థ యాజమాన్యం మూడుసార్లు చేతులు మారింది. తొలుత మ్యాగ్మా ఫిన్‌కార్ప్ నుంచి పూనావాలా హౌసింగ్‌కు, ఆపై టీపీజీ క్యాపిటల్ చేతికి యాజమాన్య వాటా బదిలీ అయ్యింది. అందుబాటు ధరల హౌసింగ్‌పై దృష్టిపెట్టిన కంపెనీ పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్‌లో 99 శాతానికిపైగా వాటాను 2022 జులైలో సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 3,900 కోట్లు వెచి్చంచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మరో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ సీఎఫ్‌వో మనీష్ జైస్వాల్ వెల్లడించారు. కంపెనీ పేరును గృహమ్ ఫైనాన్స్‌గా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. -
టీపీజీ చేతికి పూనావాలా హౌసింగ్
ముంబై: అనుబంధ సంస్థ పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్‌ను పీఈ దిగ్గజం టీపీజీకి విక్రయించినట్లు ఎన్బీఎఫ్సీ పూనావాలా ఫిన్‌కార్ప్ తాజాగా తెలియజేసింది. డీల్ విలువను రూ. 3,900 కోట్లుగా వెల్లడించింది. అయితే ఈ లావాదేవీ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని వ్యాక్సిన్ల దిగ్గజం సైరస్ పూనావాలా గ్రూప్ కంపెనీ పేర్కొంది. టీపీజీ గ్లోబల్‌కు చెందిన పెర్సూ్యస్ ఎస్జీ ఈ లావాదేవీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. వాటాదారులకు విలువ చేకూర్చడంతోపాటు.. కన్జూమర్, ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకు ఈ విక్రయం దోహదపడనున్నట్లు వివరించింది. టెక్నాలజీ ఆధారిత వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రానున్న మూడేళ్లలో లోన్‌బుక్‌లో 35–40 శాతం వార్షిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో మొండిబకాయిల(ఎన్పీఏలు)ను 1 శాతంలోపు కట్టడి చేయాలని నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేసింది. ఫైనాన్షియల్స్‌కు ప్రాధాన్యత ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్‌కు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్నదని, వాటాదారులకు విలువను చేకూర్చడంలో పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని పూనావాలా ఫిన్‌కార్ప్ చైర్మన్ అదార్ పూనావాలా పేర్కొన్నారు. మార్కెట్లో భారీ అవకాశాలరీత్యా తాజా విక్రయం వృద్ధికి మరింత మద్దతునిస్తుందని కంపెనీ ఎండీ అభయ్ భుటాడా అభిప్రాయపడ్డారు. కన్జూమర్, ఎంఎస్ఎంఈపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. తాజా పెట్టుబడుల ద్వారా వృద్ధి మరింత ఊపందుకుంటుందని తెలియజేశారు. 2021 ఫిబ్రవరిలో మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌ను రూ. 3,456 కోట్లకు పూనావాలా ఫిన్‌కార్ప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ అదార్ పూనావాలా సంస్థ రైజింగ్ సన్ హోల్డింగ్స్ చేతిలో ఉంది. -
యూపీఎల్‌లో నాలుగు దిగ్గజాల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్ దిగ్గజం యూపీఎల్‌లో నాలుగు అంతర్జాతీయ సంస్థలు మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. యూపీఎల్ ప్రకటన ప్రకారం ఇందుకోసం అబు దాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), బ్రూక్‌ఫీల్డ్, కేకేఆర్, టీపీజీ వేర్వేరుగా రూ. 4,040 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అగ్రి–టెక్ ప్లాట్‌ఫాం యూపీఎల్ ఎస్‌ఏఎస్‌లో ఏడీఐఏ, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ 9.09 శాతం వాటాల కోసం 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,580 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీనికోసం యూపీఎల్ ఎస్ఏఎస్ ఈక్విటీ వేల్యుయేషన్‌ను 2.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 17,380 కోట్లు)గా లెక్కకట్టారు. ఇక, 2.25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. రూ. 18,450 కోట్లు) వేల్యుయేషన్‌తో ’అడ్వాంటా ఎంటర్ప్రైజెస్ – గ్లోబల్ సీడ్స్ ప్లాట్‌ఫాం’లో కేకేఆర్ రూ. 2,460 కోట్లు (300 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. మరోవైపు, గ్లోబల్ క్రాప్ ప్రొటెక్షన్ ప్లాట్‌ఫాంగా వ్యవహరించే యూపీఎల్ కేమ్యాన్లో ఏడీఐఏ, టీపీజీ 22.2 శాతం కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. -
రిలయన్స్‌లో జీఐసీ, టీపీజీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ వ్యాపార దిగ్గజ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పెట్టుబడులు వచ్చి చేరనున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీఐసీ రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించింది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 1.22 శాతం వాటాను జీఐసీ చేజిక్కించుకోనుంది. డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ను రూ.4.285 లక్షల కోట్లుగా విలువ కట్టారు. మరో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టీపీజీ తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 0.41 శాతం వాటాను టీపీజీ దక్కించుకోనుంది. ఈ ఏడాది ప్రారంభంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో టీపీజీ రూ.4,546.8 కోట్లు పెట్టుబడి చేసింది. -
రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల వెల్లువ
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో వరుస పెట్టుబడులు పెడుతున్న సంస్థల జాబితాలో మరో రెండు విదేశీ దిగ్గజాలు చేరాయి. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీ, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ రిలయన్స్ రిటైల్ యూనిట్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. జీఐసీ రూ .5,512.5 కోట్లు, టీపీజీ 1,837.5 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఆర్ఆర్విఎల్లో వరుసగా 1.22 శాతం, 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి. తాజా పెట్టుబడులతో పాటురిలయన్స్ రిటైల్ ఇప్పటివరకూ 7.28 శాతం వాటాల విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సాధించింది. జియో తరువాత వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో ఇవి వరుసగా ఆరో, ఏడు పెట్టుబడుల ఒప్పందాలు కావడం విశేషం జీఐసీ ప్రపంచ నెట్వర్క్, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు భారత రిటైల్ వ్యవస్థను మెరుగుపరుస్తూ, మరింతగా మారుస్తాయని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ తన సప్లై చైన్, స్టోర్ నెట్వర్క్స్, లాజిస్టిక్స్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కొనసాగిస్తూ కస్టమర్లు, వాటాదారులకు మరింత ప్రయోజనం కలగనుందని జీఐసీ సీఈఓ లిమ చౌ కియాత్ తెలిపారు. కాగా సిల్వర్ లేక్ ఆ తర్వాత కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబదాల కూడా పెట్టుబడులు పెట్టాయి. మూడు వారాల్లో ఆరు డీల్స్ సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ 0.84 శాతం వాటాకుగాను 3,675 కోట్ల రూపాయలు, సిల్వర్ లేక్ పార్ట్నర్స్ 1,875 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆర్‌ఆర్‌విఎల్ 3.38 బిలియన్ల డాలర్లతో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. రిలయన్స్ రిటైల్ ఇండియాలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక సంస్థ. 12,000 స్టోర్లతో, 64 కోట్ల వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద రీటైలర్ గా ఉన్న సంగతి తెలిసిందే. -
జెట్ రేసులో ఇండిగో!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్టున్నాయి. రుణాలు తీర్చలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఈ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు వాటిని వసూలు చేసుకునేందుకు మార్గంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేయడం తెలిసిందే. ఓ పరిష్కార నిపుణుడిని నియమించి, 90 రోజుల్లోపు దీనికి పరిష్కారం కనుగొనాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఎన్సీఎల్టీ ముంగిటకు చేరిన జెట్ ఎయిర్వేస్పై పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశీయంగా విమానయానంలో అతిపెద్ద వాటా కలిగిన ఇండిగో దివాలా దశకు చేరిన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇందుకోసం ప్రైవేటు ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌తో కలసి దివాలా చట్టం (ఐబీసీ) కింద జెట్ఎయిర్వేస్కు బిడ్ వేయనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన మరో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ కొనుగోలుకు ముందుకొస్తోంది ఆసక్తిగల ఇతర ఇన్వెస్టర్లతో కలసి జెట్ ఎయిర్వేస్కు బిడ్ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమస్యాత్మక కంపెనీల్లో పెట్టుబడులకు అపోలో గ్లోబల్ ప్రసిద్ధి చెందిన సంస్థ. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంను సంప్రదించినట్టు తెలిసింది. ఈ సంస్థ నిర్వహణలో 280 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ప్రాథమిక చర్చలు జరిగాయి... ‘‘ఇండిగో, టీపీజీ క్యాపిటల్ జెట్ ఎయిర్వేస్ పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లీడ్ బ్యాంకర్ అయిన ఎస్బీఐతో ఇటీవలే ప్రాథమిక చర్చలు కూడా నిర్వహించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియ కింద ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ వేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ, అంతర్జాతీయ స్లాట్లపై ఇండిగో ఆసక్తిగా ఉంది. తద్వారా తన మార్కెట్ వాటాను కాపాడుకోవాలని భావిస్తోంది. జెట్ ప్రివిలేజ్ ప్రైవేటు లిమిటెడ్ (జేపీపీఎల్) పట్ల టీపీజీ క్యాపిటల్ ఎక్కువ ఆసక్తితో ఉంది. ఎందుకంటే జెట్ ఎయిర్‌వేస్‌తో పోలిస్తే జేపీపీఎల్ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడమే కాకుండా, గతంలో లాభాలు కూడా చవిచూసింది.స్వతంత్ర సంస్థ అయిన జేపీపీఎల్ దివాలా చర్యల్లో భాగంగా లేకపోవడమే ఉన్న అడ్డంకి. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో జేపీపీఎల్ను కూడా భాగం చేయవచ్చా అన్నదానిపై ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జేపీపీఎల్ అన్నది జెట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో తరచుగా ప్రయాణించే వారి కోసం ఉద్దేశించిన లాయల్టీ ప్రోగ్రామ్. 2012లో జెట్ సొంత విభాగంగా ఏర్పాటవ్వగా, 2014లో స్వతంత్ర సంస్థగా మార్చారు. ఆ ఏడాది ఎతిహాద్ ఎయిర్వేస్ 150 మిలియన్ డాలర్లతో 50.1 శాతం వాటా తీసుకుంది. మిగిలిన వాటా జెట్ చేతుల్లో ఉంది. జేపీపీఎల్ విలువ రూ.7,300 కోట్లు ఉంటుందని ఆన్ పాయింట్ లాయల్టీ అనే సంస్థ అంచనా కట్టింది. ఇక, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంతో ఇటీవలే సమావేశమైందని, వ్యాల్యూ ఇన్వెస్టర్లుగా జెట్ ఎయిర్వేస్లో మంచి అవకాశం కోసం చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జెట్ రుణదాతల కన్సార్షియం ఈ నెల 16న తొలిసారి సమావేశమై చర్చలు కూడా నిర్వహించింది. ఈ వారాంతంలోపు జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం పలకొచ్చని, బిడ్లు వేసేందుకు ఆగస్ట్ మొదటి వారం వరకు గడువు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. -
భూ సేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాలు మానుకోవాలి
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): భూ సేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అపరాల మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం గొర్ల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2103లో భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజల ఆస్తులకు గ్యారంటీ లేని పరిస్థితిని సృష్టించిందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ అవసరాలకు భూమిని సేకరించాలంటే కచ్చితంగా 4 రెట్లు పరిహారం అందించాలన్నారు. ఏప్రిల్ 7,8 తేదీలలో ఉపాధి హామీపై ఆందోళన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
కారులో మంటలు
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ రోడ్డులోని పెట్రోలు బంక్ పక్కన ఆగి ఉన్న కారు నుంచి బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు స్పందించి ఫైర్ సిబ్బంది ఫోన్ చేయడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రేడియేటర్ వేడెక్కడం వల్ల ఈ మంటలు వ్యాపించాయని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. కారులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదమూ సంభవించలేదు. -
పల్స్ సర్వేను పరిశీలించిన జేసీ
తాడేపల్లిగూడెం రూరల్ : పట్టణంలో 32వ వార్డులో నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వే పనితీరును బుధవారం జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వేలో తలెత్తుతున్న ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సర్వే చేపట్టడం వల్ల సర్వర్లు సరిగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని సభ్యులందరి వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ సర్వే పూర్తి చేయవలసి ఉందన్నారు. ఆయన తహసీల్దార్ పాశం నాగమణి, మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, ఆర్ఐ బొడ్డేపల్లి దుర్గారావు ఉన్నారు.