ముంబై: అనుబంధ సంస్థ పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్‌ను పీఈ దిగ్గజం టీపీజీకి విక్రయించినట్లు ఎన్‌బీఎఫ్‌సీ పూనావాలా ఫిన్‌కార్ప్ తాజాగా తెలియజేసింది. డీల్ విలువను రూ. 3,900 కోట్లుగా వెల్లడించింది. అయితే ఈ లావాదేవీ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని వ్యాక్సిన్ల దిగ్గజం సైరస్ పూనావాలా గ్రూప్ కంపెనీ పేర్కొంది. టీపీజీ గ్లోబల్‌కు చెందిన పెర్సూ్యస్ ఎస్‌జీ ఈ లావాదేవీని చేపట్టనున్నట్లు తెలియజేసింది.
వాటాదారులకు విలువ చేకూర్చడంతోపాటు.. కన్జూమర్, ఎంఎస్‌ఎంఈ ఫైనాన్సింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకు ఈ విక్రయం దోహదపడనున్నట్లు వివరించింది. టెక్నాలజీ ఆధారిత వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రానున్న మూడేళ్లలో లోన్‌బుక్‌లో 35–40 శాతం వార్షిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో మొండిబకాయిల(ఎన్‌పీఏలు)ను 1 శాతంలోపు కట్టడి చేయాలని నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేసింది.
ఫైనాన్షియల్స్‌కు ప్రాధాన్యత
ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్‌కు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్నదని, వాటాదారులకు విలువను చేకూర్చడంలో పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని పూనావాలా ఫిన్‌కార్ప్ చైర్మన్ అదార్ పూనావాలా పేర్కొన్నారు. మార్కెట్లో భారీ అవకాశాలరీత్యా తాజా విక్రయం వృద్ధికి మరింత మద్దతునిస్తుందని కంపెనీ ఎండీ అభయ్ భుటాడా అభిప్రాయపడ్డారు. కన్జూమర్, ఎంఎస్‌ఎంఈపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. తాజా పెట్టుబడుల ద్వారా వృద్ధి మరింత ఊపందుకుంటుందని తెలియజేశారు. 2021 ఫిబ్రవరిలో మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌ను రూ. 3,456 కోట్లకు పూనావాలా ఫిన్‌కార్ప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ అదార్ పూనావాలా సంస్థ రైజింగ్ సన్ హోల్డింగ్స్ చేతిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment