Sale of shares
-
అమ్మకానికి ‘ఎనిమీ ప్రాపర్టీ’ షేర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా 84 కంపెనీల్లోని 2.91 లక్షల ’ఎనిమీ ప్రాపరీ్ట’ షేర్లను విక్రయించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 20 కంపెనీల్లో 1.88 లక్షల షేర్లను విక్రయించనుంది. ఇందుకోసం 10 కేటగిరీల కొనుగోలుదార్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో వ్యక్తులు, ప్రవాస భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్లు, ట్రస్టులు, కంపెనీలు ఉన్నాయి. ఫిబ్రవరి 8 కల్లా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. 1947–1962 మధ్య కాలంలో శతృదేశాలైన పాకిస్తాన్, చైనాకు వెళ్లిపోయి, అక్కడి పౌరసత్వం తీసుకున్న వారికి భారత్‌లో ఉన్న ఆస్తులను ’ఎనిమీ ప్రాపరీ్ట’గా వ్యవహరిస్తారు. ఇవి కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఫర్ ఇండియా (సీఈపీఐ) అ«దీనంలో ఉన్నాయి. బిడ్డర్లు తమకు ఏ కంపెనీల్లో ఎన్ని షేర్లు, ఏ ధరకు కావాలనేది బిడ్‌లో తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒకో కంపెనీ షేర్లకు నిర్దిష్ట ధరను రిజర్వ్ రేటుగా నిర్ణయిస్తుంది. దీన్ని వెల్లడించదు. అంతకన్నా తక్కువ రేటు కోట్ చేసే బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. -
ఫస్ట్‌క్రైలో సాఫ్ట్‌బ్యాంక్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: త్వరలో ఐపీవోకి రానున్న రిటైల్ సంస్థ ఫస్ట్‌క్రైలో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 310 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించింది. రెండు విడతల్లో షేర్లను విక్రయించగా, కొందరు అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్స్‌తో ఫస్ట్‌క్రై వేల్యుయేషన్‌ను 3.5–3.75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లు పేర్కొన్నాయి. 900 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఫస్ట్‌క్రైలో సాఫ్ట్‌బ్యాంక్ గతంలో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా విక్రయానంతరం కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్‌కు ఇంకా 800–900 మిలియన్ డాలర్ల విలువ చేసే వాటాలు ఉన్నాయి. వీటిని తర్వాత విక్రయించే యోచనలో ఉంది. మొత్తం మీద ఫస్ట్‌క్రైలో పెట్టుబడుల ద్వారా 1.3 బిలియన్ డాలర్లు ఆర్జించడంపై సాఫ్ట్‌బ్యాంక్ దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
డెల్హివరి నుంచి కార్లయిల్ ఔట్ 2.53% వాటా విక్రయం
న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం కార్లయిల్ తాజాగా సప్లై చైన్ కంపెనీ డెల్హివరీలోగల మొత్తం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 2.53 శాతం వాటాకు సమానమైన 1.84 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్‌డీల్ వివరాల ప్రకారం షేరుకి రూ. 385.5 సగటు ధరలో వీటిని దాదాపు రూ. 710 కోట్లకు అమ్మివేసింది. షేర్లను కొనుగోలు చేసిన జాబితాలో బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్, నార్జెస్ బ్యాంక్, సొసైటీ జనరాలి, సౌదీ సెంట్రల్ బ్యాంక్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తదితరాలున్నాయి. ఎక్సే్ఛంజీ గణాంకాల ప్రకారం మార్చికల్లా డెల్హివరీలో యూఎస్ సంస్థ కార్లయిల్ 2.53 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది నవంబర్‌లో డెల్హివరీలో 2.5 శాతం వాటాను కార్లయిల్ రూ. 607 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 387 వద్ద ముగిసింది. -
కోల్ ఇండియా @ రూ. 225
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. నేడు(జూన్ 1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం(2న) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపడుతోంది. ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం తొలుత 1.5 శాతం వాటాకు సమానమైన 9.24 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అత్యధిక స్పందన లభిస్తే మరో 1.5 శాతం వాటాను సైతం విక్రయించేందుకు గ్రీన్ షూ ఆప్షన్ ఎంచుకుంది. వెరసి కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వం విక్రయిస్తున్న వాటాకు రూ. 4,158 కోట్లు లభించనున్నాయి. వెరసి ఈ ఏడాది(2023–24) తొలిసారి పీఎస్యూలో ప్రభుత్వం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. బీఎస్ఈలో బుధవారం కోల్ ఇండియా షేరు 1.3 శాతం నష్టంతో రూ. 241 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. -
79 కోట్ల టన్నుల కార్గో
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన నౌకాశ్రయాల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 79.5 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. వాటాల విక్రయం ద్వారా రూ.3,700 కోట్లు సాధించాలన్న లక్ష్యాన్ని మించి రూ.5,000 కోట్ల విలువైన రవాణా లావాదేవీలు జరిగాయని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ సెక్రటరీ సుధాన్‡్ష పంత్ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే సరుకు రవాణా గత ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం అధికంగా జరిగిందని తెలిపారు. పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి సర్వానంద సోనోవాల్ గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో ప్రధాన నౌకాశ్రయాల్లో దీనదయాల్ (కాండ్లా), ముంబై, మార్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్ (కామరాజార్), ట్యూటికోరిన్, విశాఖపట్నం, పారదీప్, కోల్‌కత (హాల్దియాతో కలిపి), జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉన్నాయి. స్వల్పంగా పెరిగిన వాటా.. ప్రధానేతర పోర్టులతో పోలిస్తే చాలా ఏళ్ల తర్వాత మేజర్ పోర్టులు అధిక వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయని పంత్ తెలిపారు. ‘ప్రధానేతర పోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడతాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఓడరేవులను ప్రైవేట్ భాగస్వాములకు లీజుకు ఇచ్చాయి. సరుకు రవాణాలో నాన్–మేజర్ పోర్టులు 8.5–9 శాతం వృద్ధి చెందాయి. మొత్తం కార్గోలో ప్రధాన పోర్టుల వాటా 54 నుంచి 55 శాతానికి, నాన్–మేజర్ పోర్టుల వాటా 46 నుంచి 45 శాతానికి వచ్చి చేరింది. ప్రధాన పోర్టులకు 1 శాతం మార్పు కూడా చాలా ముఖ్యమైన విజయం. ఎందుకంటే చాలా సవాళ్లు ఉన్నప్పటికీ ఇవి తమ వాటాను పెంచుకున్నాయి. జలమార్గాల ద్వారా సరుకు రవాణా 16 శాతం ఎగసి 12.6 కోట్ల టన్నులకు చేరింది. ప్రధాన పోర్టులకు వచ్చిన నౌక పని ముగించుకుని వెళ్లేందుకు అయ్యే సమయం 3–4 గంటలు తగ్గింది’ అని వివరించారు. -
హెచ్ఏఎల్ ఓఎఫ్‌ఎస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) షేర్ల విక్రయానికి తొలి రోజు 4.5 రెట్లు అధిక స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచగా.. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ కనిపించింది. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్లు బిడ్ చేసేందుకు వీలున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రీన్ షూ ఆప్షన్‌ను వినియోగించుకోనుంది. షేరుకీ రూ. 2,450 ధరలో ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం తొలుత 1.75% ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచింది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75% వాటాను సైతం అమ్మివేయనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు లభించనున్నాయి. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7% (రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 2,497 ఎగువన నిలిచింది. -
బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవో బీ) తన సబ్సిడరీ అయిన బీవోబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ (బీఎఫ్ఎస్ఎల్)లో 49 శాతం వరకు వాటాలను విక్రయించనుంది. ఇందుకు సంబంధించి బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీకి ప్రస్తుతం 100 శాతం వాటా కలిగి ఉంది. అర్హత కలిగిన ఇన్వెస్టర్లు, వ్యూహాత్మక భాగస్వాముల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు కోరుతూ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని బీవోబీ తెలిపింది. -
పేటీఎంలో ఆలీబాబా వాటాల విక్రయం
న్యూఢిల్లీ: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ దాదాపు 3 శాతం వాటాలను విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 1,031 కోట్లు. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ డేటా ప్రకారం ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ 1.92 కోట్ల షేర్లను (సుమారు 2.95 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 536.95 రేటుకి విక్రయించింది. దీనితో వన్97లో ఆలీబాబా మొత్తం వాటాలు 31.14 శాతం నుంచి 28.19 శాతానికి తగ్గాయి. గురువారం పేటీఎం షేర్లు 6 శాతం క్షీణించి రూ. 543.50 వద్ద ముగిశాయి. పేటీఎం రుణ వృద్ధి 4 రెట్లు కాగా, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనితో డిసెంబర్ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్ క్యాపిటల్, పిరమల్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. -
టీపీజీ చేతికి పూనావాలా హౌసింగ్
ముంబై: అనుబంధ సంస్థ పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్‌ను పీఈ దిగ్గజం టీపీజీకి విక్రయించినట్లు ఎన్బీఎఫ్సీ పూనావాలా ఫిన్‌కార్ప్ తాజాగా తెలియజేసింది. డీల్ విలువను రూ. 3,900 కోట్లుగా వెల్లడించింది. అయితే ఈ లావాదేవీ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని వ్యాక్సిన్ల దిగ్గజం సైరస్ పూనావాలా గ్రూప్ కంపెనీ పేర్కొంది. టీపీజీ గ్లోబల్‌కు చెందిన పెర్సూ్యస్ ఎస్జీ ఈ లావాదేవీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. వాటాదారులకు విలువ చేకూర్చడంతోపాటు.. కన్జూమర్, ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకు ఈ విక్రయం దోహదపడనున్నట్లు వివరించింది. టెక్నాలజీ ఆధారిత వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రానున్న మూడేళ్లలో లోన్‌బుక్‌లో 35–40 శాతం వార్షిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో మొండిబకాయిల(ఎన్పీఏలు)ను 1 శాతంలోపు కట్టడి చేయాలని నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేసింది. ఫైనాన్షియల్స్‌కు ప్రాధాన్యత ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్‌కు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్నదని, వాటాదారులకు విలువను చేకూర్చడంలో పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని పూనావాలా ఫిన్‌కార్ప్ చైర్మన్ అదార్ పూనావాలా పేర్కొన్నారు. మార్కెట్లో భారీ అవకాశాలరీత్యా తాజా విక్రయం వృద్ధికి మరింత మద్దతునిస్తుందని కంపెనీ ఎండీ అభయ్ భుటాడా అభిప్రాయపడ్డారు. కన్జూమర్, ఎంఎస్ఎంఈపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. తాజా పెట్టుబడుల ద్వారా వృద్ధి మరింత ఊపందుకుంటుందని తెలియజేశారు. 2021 ఫిబ్రవరిలో మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌ను రూ. 3,456 కోట్లకు పూనావాలా ఫిన్‌కార్ప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ అదార్ పూనావాలా సంస్థ రైజింగ్ సన్ హోల్డింగ్స్ చేతిలో ఉంది. -
వచ్చే ఏడాదిలో మరింత స్పీడ్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను మరింత వేగవంతం చేయనుంది. పీఎస్‌యూ దిగ్గజాలు బీపీసీఎల్, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ)లలో వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని చేపట్టనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 65,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రతిపాదించింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో తొలుత పెట్టుకున్న లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లతో పోలిస్తే తాజా టార్గెట్‌లో భారీగా కోత పడింది. సవరించిన తాజా అంచనాల ప్రకారం మార్చితో ముగియనున్న ఈ ఏడాది రూ. 78,000 కోట్లు సమీకరించగలమని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కాగా.. వచ్చే ఏడాది ఈసీజీసీసహా మూడు పీఎస్‌యూల పబ్లిక్ ఇష్యూలు చేపట్టనున్నట్లు పాండే తెలియజేశారు. మైనారిటీ వాటాలు వచ్చే ఏడాది లక్ష్యాలను చేరేందుకు కొన్ని సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాలను సైతం విక్రయించనున్నట్లు పాండే వెల్లడించారు. పవన్ హంస్ కొనుగోలుకి పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పేర్కొన్నారు. ఇక ఎస్సీఐ, బీపీసీఎల్, బీఈఎంఎల్.. ఫైనాన్షియల్ బిడ్స్ దశకు చేరినట్లు తెలియజేశారు. -
బ్యాంకుల ప్రైవేటీకరణకు త్వరలో చట్ట సవరణ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మెజారిటీ వాటాల విక్రయానికి అనుగుణంగా బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, 2021ను 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. తాజా చట్ట సవరణ బిల్లులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీస ప్రభుత్వ వాటాను 51 శాతం నుండి 26 శాతానికి తగ్గించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా కేంద్ర మంత్రివర్గం ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
నవంబర్ 8 నుంచి పేటీఎం ఐపీవో
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఇప్పటికే సమర్పించిన పత్రాల్లో ధర శ్రేణి, ఏ ఇన్వెస్టరు ఎంత విక్రయించనున్నారు, ఇతర వివరాలను తర్వాత అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు, పేటీఎం ఐపీవో పరిమాణం రూ. 18,300 కోట్లకు పెరిగింది. కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన ఆలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ ఫైనాన్షియల్తో పాటు సాఫ్ట్‌బ్యాంక్ తదితర ఇతర ఇన్వెస్టర్లు మరిన్ని వాటాలు విక్రయించాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ద్వారా సుమారు రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎం తొలుత ప్రణాళికలు వేసుకుంది. సుమారు రూ. 8,300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయాలని, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లు సుమారు రూ. 8,300 కోట్ల షేర్లను విక్రయించాలని భావించింది. కానీ తాజాగా ప్రస్తుత షేర్హోల్డర్లు మరిన్ని వాటాలు విక్రయిస్తుండటంతో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి ఉంచే షేర్ల పరిమాణం మరో రూ. 1,700 కోట్లు పెరిగి రూ. 10,000 కోట్లకు చేరినట్లవుతుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే వాటాల్లో దాదాపు సగం వాటా యాంట్ ఫైనాన్షియల్‌ది కానుండగా, మిగతాది ఆలీబాబా, ఎలివేషన్ క్యాపిటల్, సాఫ్ట్‌బ్యాంక్, ఇతర షేర్‌హోల్డర్లది ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించినప్పుడు వాటాలు విక్రయించే ఇన్వెస్టర్ల జాబితాలో సాఫ్ట్‌బ్యాంక్ పేరు లేదు. స్విస్ రీఇన్సూరెన్స్‌కి వాటాలు.. పేటీఎం బీమా విభాగం పేటీఎం ఇన్సూర్టెక్ (పీఐటీ)లో స్విట్జర్లాండ్‌కి చెందిన రీఇన్సూరెన్స్ వ్యాపార దిగ్గజం స్విస్ రీఇన్సూరెన్స్ 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 920 కోట్లుగా ఉండనుంది. దీని కింద ముందస్తుగా రూ. 397 కోట్లు, మిగతాది విడతలవారీగా స్విస్ రీఇన్సూరెన్స్ చెల్లించనుంది. దేశీ బీమా మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్విస్ రీఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని ఈ సందర్భంగా పేటీఎం చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఆయన వ్యక్తిగతంగా కూడా పీఐటీలో పెట్టుబడి పెట్టనున్నారు. అయితే, శర్మ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయనున్నదీ వెల్లడి కాలేదు. -
జియో వన్స్‌మోర్..ముకేశ్ హ్యాట్రిక్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ .. పెట్టుబడుల సమీకరణలో జోరుగా దూసుకుపోతోంది. తాజాగా మరో అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌తో జట్టు కట్టింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్టా 2.32 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ. 11,367 కోట్లు. దీంతో మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్లాట్‌ఫామ్స్ ఏకంగా రూ. 60,596 కోట్లు సమీకరించినట్లయింది. ‘ఈ పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ తర్వాత విస్టా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉంటుంది. దీంతో కేవలం మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలోనే దిగ్గజ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 60,596.37 కోట్లు సమీకరించినట్లవుతుంది‘ అని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఇప్పటికే రూ. 43,574 కోట్లతో 9.99 శాతం, మరో టెక్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సిల్వర్ లేక్ రూ. 5,666 కోట్లతో 1.15% వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది. 20 శాతం వాటా విక్రయం దిశగా... డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 38.8 కోట్ల సబ్‌స్క్రయిబర్స్‌తో అత్యంత తక్కువ కాలంలోనే టెలికం దిగ్గజంగా ఎదిగిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇందులో భాగంగా ఉంది. వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లకు జియో ప్లాట్‌ఫామ్స్ 20 శాతం వాటాలు విక్రయించాలని నిర్దేశించుకుంది. ఇప్పటికే మూడు ఒప్పందాల ద్వారా 13.46 శాతం వాటాలను విక్రయించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పెట్టుబడులు సమీకరించనుంది. డిసెంబర్ నాటికే రుణాలు తీర్చేసే దిశగా.. 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాది ఆగస్టులో నిర్దేశించుకుంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే ఈ ఏడాది డిసెంబర్లోనే దాన్ని సాధించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పెట్టుబడులు, రూ. 53,125 కోట్ల ప్రతిపాదిత రైట్స్ ఇష్యూ, సౌదీ ఆరామ్కో వంటి దిగ్గజాలకు గ్రూప్ సంస్థల్లో వాటాల విక్రయం వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. మార్చి ఆఖరు నాటికి రిలయన్స్ రుణభారం రూ. 3,36,294 కోట్లుగా ఉండగా, నగదు నిల్వలు రూ. 1,75,259 కోట్లు. సర్దుబాట్లు చేస్తే నికర రుణం రూ. 1,61,035 కోట్లు. రుణాలు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా జూన్ నాటికి రైట్స్ ఇష్యూ వంటివన్నీ కలిపి రూ. 1.04 లక్షల కోట్లు సమీకరించవచ్చని కంపెనీ భావిస్తోంది. మూడు డీల్స్‌లో జియోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్: 60,596 కోట్లు ఫేస్బుక్ పెట్టుబడి (9.99% వాటా) : 43,574 కోట్లు విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ (2.32% వాటా) : 11,367కోట్లు సిల్వర్ లేక్ పెట్టుబడి (1.15 % వాటా) : 5,666 కోట్లు జియో ఎంటర్ప్రైజ్ విలువ :5.16 లక్షల కోట్లు విస్టా సహ వ్యవస్థాపకుడు మనోడే..! అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం విస్టా ప్రధానంగా సాఫ్ట్వేర్, డేటా, టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దాదాపు 57 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం విస్టా పోర్ట్‌ఫోలియోలో భారత కంపెనీల్లో సుమారు 13,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ సేథ్‌కి భారతీయ మూలాలు ఉన్నాయి. ముకేశ్ అంబానీలాగే ఆయన తండ్రి కూడా గుజరాత్‌కు చెందినవారు. అంతే గాకుండా విస్టా వ్యవస్థాపకుడు రాబర్ట్ స్మిత్‌తో ముకేశ్‌కు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. ముకేశ్‌కు అత్యంత సన్నిహితులైన మనోజ్ మోదీ, బ్రయాన్ సేథ్ ఈ డీల్ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ సేథ్ ప్రపంచంలోనే దిగ్గజ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లో ఒకటైన విస్టాతో భాగస్వామ్యం కుదరడం సంతోషకరం. రాబర్ట్ స్మిత్‌తో పాటు గుజరాత్‌కి చెందిన కుటుంబ నేపథ్యమున్న బ్రయాన్ సేథ్.. ఇద్దరూ అంతర్జాతీయంగా ప్రముఖ టెక్నాలజీ లీడర్లు. డిజిటల్ భారతదేశ వృద్ధి సామర్థాలపైగట్టి నమ్మకం ఉన్నవారు. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత్ కోసం జియో నిర్మిస్తున్న డిజిటల్ సమాజం సామర్ధ్యంపై మాకు నమ్మకం ఉంది. ముకేశ్ అంబానీ దార్శనికత, ప్రపంచస్థాయి జియో నాయకత్వ బృందం కలిసి ప్రారం భించిన డేటా విప్లవాన్ని మరింత ముం దుకు తీసుకెళ్లగలవు. – రాబర్ట్ స్మిత్, విస్టా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో -
ఏషియన్ పెయింట్స్‌లో రిలయన్స్ వాటాల విక్రయం?
న్యూఢిల్లీ: రుణభారాన్ని మరింతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా దేశీ పెయింట్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్‌లో తనకున్న 4.9 శాతం వాటాలను విక్రయించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. గురువారం ఏషియన్ పెయింట్స్ షేరు ముగింపు ధర రూ. 1,594ను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ వాటాల విలువ సుమారు 989 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 7,490 కోట్లు) ఉంటుంది. ఇప్పటికే వాటాల విక్రయానికి సంబంధించి బ్యాంకులతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్లాక్ డీల్స్ ద్వారా విడతల వారీగా ఈ వాటాలను అమ్మాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. తీస్తా రిటైల్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఏషియన్ పెయింట్స్‌లో రిలయన్స్‌కు వాటాలు ఉన్నాయి. 2021 మార్చి నాటికి రుణరహిత సంస్థగా ఆవిర్భవించాలని కంపెనీ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. -
కిక్కు తగ్గింది..
కాజీపేట అర్బన్: అలిసిన మనసుకు సాంత్వన కలుగుతుందని కొందరు.. అలవాటుతో మరికొంద రు.. బానిసలై ఇంకొందరు సాయంత్రం అయిందంటే మద్యం తాగాల్సిందే! అయితే, డబ్బు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన కొన్ని బ్రాండ్ల మందు ఎంత తాగినా కిక్కు ఎక్కడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎలాగూ మద్యపాన ప్రియులు మందులో నీళ్లు కలుపుతారు కదా.. అదే పని మేమే చేస్తే పోలా.. అన్న భావనతో కొందరు వైన్స్, బార్ల యజమానులు ఇష్టారాజ్యంగా మందు కల్తీ చేసేస్తున్నారు. తద్వారా రూ.లక్షలు గడిస్తున్న ఈ మాఫియా, మందు బాబుల జేబులను గుళ్ల చేస్తోంది. నిలదీస్తేనే... పని ఒత్తిడిలో అలసిపోయి, శుభకార్యాల్లో ఆనందంగా గడిపేందుకు మద్యం ప్రియులు మద్యం షాపులకు వెళ్తుంటారు. సాధారణంగా క్వార్టర్ సీసా తాగితే కిక్కుతో ఊగిపోయే వారికి సైతం ఫుల్ బాటిల్ తాగినా కిక్కు ఎక్కడం లేదట! దీంతో మద్యం షాపు నిర్వాహకులను నిలదీయడంతో మద్యంలో కల్తీ జరిగిన విషయం బట్టబయలవుతోంది. ఫలితంగా మందు బాబులకు కిక్కు ఎక్కకున్నా.. మద్యం షాపుల్లోని గల్లాలు మాత్రం కళకళలాడుతున్నాయి. వేసిన సీల్ వేసినట్లే.. మద్యం బాటిళ్ల మూతకు వేసిన సీల్ వేసినట్టుగానే ఉంటుండగా.. మద్యం మాత్రం కల్తీ అవుతోంది. మద్యం బాటిళ్ల మూతలను ప్రత్యేక పరికారాలతో తీసేయడం.. నీళ్లు కలిపాక మళ్లీ మూత పెట్టడం నిష్ణాతులకే సాధ్యమవుతుంది. దీనికోసం కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన మద్యం మాఫియా ఎక్కువగా అమ్ముడయ్యే ఒరిజినల్ చాయిస్, రాయల్ స్టాగ్, బ్లెండర్ స్ప్రైడ్ వంటి బ్రాండ్ల మందు బాటిళ్లలో కల్తీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ నెలవారిగా బార్లు, వైన్స్ నుంచి అందే మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు తేలిపోతూ.. మద్యం షాపుల తనిఖీల మాటే ఎత్తడం లేదు. కల్తీ మద్యాన్ని అరికట్టడం, సమయపాలన పాటించేలా చూడాల్సి ఉన్నప్పటికీ ఆ వైపు దృష్టి సారించడం లేదు. ఇక బెల్ట్ షాపుల మాట ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట విషయానికొస్తే కొన్ని నెలలుగా సమయపాలన, కల్తీ విషయంలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. నగరాల్లో బ్రాండ్ మిక్సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మద్యాన్ని నీటితో కల్తీ చేస్తుండగా కాజీపేట, హన్మకొండ, వరంగల్‌తో పాటు నగరాల్లో ఎక్కువ రేటు బ్రాండ్ మద్యంలో తక్కువ రేటు బ్రాండ్ మద్యాన్ని కలిపేస్తున్నారు. ఇటీవల హన్మకొండలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కిక్కు ఎక్కడం లేదంటూ మందు బాబులు ఏకంగా గొడవకు దిగిన విషయం విదితమే. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని.. జనగామలోని వైన్‌షాపులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా నీళ్లు కలిపిన 27 బాటిళ్లు లభ్యమయ్యాయి. ములుగు జంగాలపల్లిలో వైన్‌షాపులో ఏకంగా 500 కల్తీ చేసిన మద్యం బాటిళ్లు లభించడం గమనార్హం. ములుగులో మద్యం బాటిళ్ల మూతలు తీసి నీళ్లు కలిపే ముఠాను పట్టుకుని 20 బాటిల్లు, మూతలు, క్యాన్లలోని లూజ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన తనిఖీల్లో ఓ వైన్స్‌లో 19 కల్తీ చేసిన మద్యం బాటిళ్లు లభించాయి. -
ఎంఎంటీసీలో 15% ప్రభుత్వ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంఎంటీసీలో 15 శాతం వాటాలు విక్రయించడం ద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు 15 కోట్ల షేర్లను విక్రయించవచ్చని సంస్థ చైర్మన్ వేద్ ప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం రూ. 52.80గా ఉన్న ఎంఎంటీసీ షేరు ధరను బట్టి చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 800 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎంఎంటీసీలో కేంద్రానికి 80.93 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు, ఆంక్షలు సడలించిన దరిమిలా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంఎంటీసీ 50 టన్నుల మేర పసిడి దిగుమతి చేసుకోనున్నట్లు వేద్ ప్రకాశ్ తెలిపారు. అలాగే, వెండి దిగుమతులు 200 టన్నులకు పెరుగుతాయన్నారు. -
వచ్చే నెల బీహెచ్ఈఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) కోసం ప్రభుత్వం కంపెనీల జాబితాను సిద్ధం చేసింది. దీని ప్రకారం ఏప్రిల్‌లో ముందుగా బీహెచ్ఈఎల్లో వాటాలు విక్రయించనుంది. తద్వారా రూ. 3,200 కోట్లు రాగలవని అంచనా వేస్తోంది. ఇప్పటికే బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి సంబంధించి లండన్, సింగపూర్, హాం కాంగ్‌లలో డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం రోడ్‌షోలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కంపెనీ షేరు ధర సుమారు రూ. 260 చొప్పున చూస్తే 12.23 కోట్ల షేర్లను విక్రయిస్తే రూ. 3,200 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వానికి బీహెచ్ఈఎల్లో 63.06 శాతం వాటాలు ఉన్నాయి. అటు ఎన్ఎండీసీ, నాల్కో, ఐవోసీ తదితర కంపెనీల్లో తలో పది శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2015-16లో పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. వివిధ పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా రూ. 41,000 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 28,500 కోట్లు రాబట్టాలని యోచిస్తోంది. -
భారత్‌కు బ్రిటన్ బీమా గ్రూప్ ఆర్ఎస్ఏ గుడ్‌బై
- రాయల్ సుందరం ఇన్సూరెన్స్‌లో 26 శాతం వాటాల విక్రయం - డీల్ విలువ రూ. 450 కోట్లు చెన్నై: బీమా సంస్థ రాయల్ సుందరం అలయన్స్‌లో తమకున్న 26 శాతం వాటాలను విక్రయించాలని బ్రిటన్‌కు చెందిన ఆర్ఎస్ఏ గ్రూప్ నిర్ణయించింది. తద్వారా భారత మార్కెట్ నుంచి వైదొలగనుంది. ఈ డీల్ విలువ రూ. 450 కోట్లు. ఆరు నెలల్లో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. ఒకవైపు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయల్ సుందరం అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇకపై సుందరం ఫైనాన్స్‌కి పూర్తి అనుబంధ సంస్థగా మారుతుంది. 2000లో బీమా రంగంలో ప్రైవేట్ సంస్థలకు కూడా అనుమతినిచ్చినప్పుడు మొట్టమొదటిగా లెసైన్సు పొందిన సంస్థ రాయల్ సుందరం అలయన్స్. ప్రస్తుతం వాహన, వైద్య, వ్యక్తిగత ప్రమాద బీమా, ట్రావెల్ తదితర బీమా పాలసీలు అందిస్తోంది. ఆర్ఎస్ఏ భాగస్వామ్యంతో గత 15 సంవత్సరాలుగా బీమా రంగంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకోగలిగినట్లు సుందరం ఫైనాన్స్ ఎండీ టీటీ శ్రీనివాసరాఘవన్ తెలిపారు. కీలకమైన మార్కెట్లపై మరింతగా దృష్టి పెట్టే దిశగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఎస్ఏ గ్రూప్ సీఈవో స్టీఫెన్ హెస్టర్ పేర్కొన్నారు.