న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం కార్లయిల్ తాజాగా సప్లై చైన్ కంపెనీ డెల్హివరీలోగల మొత్తం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 2.53 శాతం వాటాకు సమానమైన 1.84 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బీఎస్‌ఈ బ్లాక్‌డీల్ వివరాల ప్రకారం షేరుకి రూ. 385.5 సగటు ధరలో వీటిని దాదాపు రూ. 710 కోట్లకు అమ్మివేసింది.
షేర్లను కొనుగోలు చేసిన జాబితాలో బీఎన్‌పీ పరిబాస్ ఆర్బిట్రేజ్, నార్జెస్ బ్యాంక్, సొసైటీ జనరాలి, సౌదీ సెంట్రల్ బ్యాంక్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ తదితరాలున్నాయి. ఎక్సే్ఛంజీ గణాంకాల ప్రకారం మార్చికల్లా డెల్హివరీలో యూఎస్ సంస్థ కార్లయిల్ 2.53 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది నవంబర్‌లో డెల్హివరీలో 2.5 శాతం వాటాను కార్లయిల్ రూ. 607 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం నీరసించి రూ. 387 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment