న్యూఢిల్లీ: రుణభారాన్ని మరింతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా దేశీ పెయింట్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్‌లో తనకున్న 4.9 శాతం వాటాలను విక్రయించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. గురువారం ఏషియన్ పెయింట్స్ షేరు ముగింపు ధర రూ. 1,594ను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ వాటాల విలువ సుమారు 989 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 7,490 కోట్లు) ఉంటుంది. ఇప్పటికే వాటాల విక్రయానికి సంబంధించి బ్యాంకులతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్లాక్ డీల్స్ ద్వారా విడతల వారీగా ఈ వాటాలను అమ్మాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. తీస్తా రిటైల్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఏషియన్ పెయింట్స్‌లో రిలయన్స్‌కు వాటాలు ఉన్నాయి. 2021 మార్చి నాటికి రుణరహిత సంస్థగా ఆవిర్భవించాలని కంపెనీ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment