పల్స్‌ సర్వేను పరిశీలించిన జేసీ | pulse servey is check by jc | Sakshi
Sakshi News home page

పల్స్‌ సర్వేను పరిశీలించిన జేసీ

Published Wed, Jul 20 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

పల్స్‌ సర్వేను పరిశీలించిన జేసీ

పల్స్‌ సర్వేను పరిశీలించిన జేసీ

తాడేపల్లిగూడెం రూరల్‌ : పట్టణంలో 32వ వార్డులో నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వే పనితీరును బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వేలో తలెత్తుతున్న ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సర్వే చేపట్టడం వల్ల సర్వర్లు సరిగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని సభ్యులందరి వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ సర్వే పూర్తి చేయవలసి ఉందన్నారు. ఆయన తహసీల్దార్‌ పాశం నాగమణి, మున్సిపల్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ బాలాజీ, ఆర్‌ఐ బొడ్డేపల్లి దుర్గారావు ఉన్నారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement