ముంబై: దేశీ అనుబంధ సంస్థ గృహమ్ హౌసింగ్ వృద్ధి బాటలో సాగుతున్నట్లు ప్రత్యామ్నాయ ఆస్తుల నిర్వహణ దిగ్గజం టీపీజీ క్యాపిటల్ తాజాగా పేర్కొంది. పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ మార్చికల్లా రూ. 8,200 కోట్ల నిర్వహణ ఆస్తులను(ఏయూఎం) చేరుకోనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే సంస్థ ఏయూఎం రూ. 7,500 కోట్లను అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరేళ్లలో సంస్థ యాజమాన్యం మూడుసార్లు చేతులు మారింది.
తొలుత మ్యాగ్మా ఫిన్‌కార్ప్ నుంచి పూనావాలా హౌసింగ్‌కు, ఆపై టీపీజీ క్యాపిటల్ చేతికి యాజమాన్య వాటా బదిలీ అయ్యింది. అందుబాటు ధరల హౌసింగ్‌పై దృష్టిపెట్టిన కంపెనీ పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్‌లో 99 శాతానికిపైగా వాటాను 2022 జులైలో సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 3,900 కోట్లు వెచి్చంచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మరో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ సీఎఫ్‌వో మనీష్ జైస్వాల్ వెల్లడించారు. కంపెనీ పేరును గృహమ్ ఫైనాన్స్‌గా మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment