భూ సేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాలు మానుకోవాలి
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): భూ సేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అపరాల మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం గొర్ల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2103లో భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజల ఆస్తులకు గ్యారంటీ లేని పరిస్థితిని సృష్టించిందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ అవసరాలకు భూమిని సేకరించాలంటే కచ్చితంగా 4 రెట్లు పరిహారం అందించాలన్నారు. ఏప్రిల్ 7,8 తేదీలలో ఉపాధి హామీపై ఆందోళన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.