Bain Capital
-
సాయి లైఫ్ సైన్సెస్ వాటా రేసులో బెయిన్ క్యాపిటల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్ట్ రిసర్చ్, డెవలప్మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలు రేసులో యూఎస్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ ముందు వరుసలో నిలిచినట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా సాయి లైఫ్ సైన్సెస్ నుంచి టీపీజీ క్యాపిటల్ పూర్తిగా తప్పుకోనుంది. అలాగే ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారు. ప్రమోటర్ గ్రూప్ సైతం తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించినట్టయితే బెయిన్ క్యాపిటల్ నియంత్రణలోకి సాయి లైఫ్‌సైన్సెస్ వెళుతుంది. సాయి లైఫ్ సైన్సెస్‌లో టీపీజీ క్యాపిటల్‌కు 43.4 శాతం, హెచ్‌బీఎం ప్రైవేట్ ఈక్విటీ ఇండియాకు 6 శాతం, మిగిలిన వాటా ప్రమోటర్లకు ఉంది. డీల్ ద్వారా సాయి లైఫ్ సైనెŠస్స్ను రూ.6,650 కోట్లుగా విలువ కట్టినట్టు తెలుస్తోంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్, కేకేఆర్, చార్లెస్ రివర్ సైతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచాయి. -
బెయిన్ క్యాపిటల్ చేతికి పోరస్ ల్యాబ్స్
హైదరాబాద్: స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను విస్తరించే వ్యూహంలో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బైన్ క్యాపిటల్ హైదరాబాద్‌కు చెందిన పోరస్ లేబొరేటరీస్‌ను కొనుగోలు చేసింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడించలేదు. అయితే ఒప్పందం విలువ దాదాపు రూ.2,500–రూ3,000 కోట్లు (302–363 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పోరస్ నికర విక్రయాల విలువ రూ.807 కోట్లు. 2020–21తో పోల్చితే (678 కోట్లు) 19 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. స్థూలంగా ఆదాయాలు ఇదే కాలంలో 97 శాతం వృద్ధితో రూ.123 కోట్ల నుంచి రూ.242 కోట్లకు ఎగసింది. 1994లో ఎన్. పురుషోత్తమ రావు స్థాపించిన పోరస్.. స్పెషాలిటీ పాలిమర్లు, ఎలక్ట్రానిక్ రసాయనాలు, ఆగ్రోకెమికల్స్తో పాటు ఇతర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా అమ్మకం!
హైదరాబాద్: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్ రేసులో ఉన్నట్టు సమాచారం. కంపెనీ నుంచి నిష్క్రమించాలన్న ప్రణాళికను ప్రమోటర్లు పునరుద్ధరించారని, మెజారిటీ వాటాను ప్రీమియం వాల్యుయేషన్‌తో విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రాన్యూల్స్ ఇండియాలో ఈ ఏడాది జూన్ నాటికి ప్రమోటర్లకు 42.13 శాతం వాటా ఉంది. కాగా, ప్రతిపాదిత వాటా కొనుగోలుకై నాన్ బైండింగ్ బిడ్లను మూడు సంస్థలు దాఖలు చేసినట్టు సమాచారం. కొనుగోలుదార్ల వేటకై ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన కొటక్ మహీంద్రా క్యాపిటల్‌ను కంపెనీ ప్రమోటర్లు నియమించారు. వాటాల విక్రయంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై స్పందిం^è లేమని గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఈడీ ప్రియాంక చిగురుపాటి స్పష్టం చేశారు. అయితే ఫార్మా రంగంలో ఈ స్థాయి డీల్స్ సహజమని, దీంతో ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ ఆసక్తి చూపుతున్నాయని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ డీల్‌ను వేదికగా చేసుకుని మరింత విస్తరణకు ఆస్కారం ఉంటుందనేది ఆలోచన అని ఆయన అన్నారు. మూడు సంస్థలూ పోటీపడితే బిడ్డింగ్ వార్‌కు అవకాశం ఉంది. ప్రమోటర్లు తమ వాటా విక్రయానికి ఫార్మా రంగంలో వాల్యుయేషన్స్, వారసత్వ ప్రణాళిక సమస్యలు కారణంగా తెలుస్తోంది. 2019 నవంబరులోనూ ప్రమోటర్లు తమ వాటాను అమ్మాలని భావించారు. తాజా వార్తల నేపథ్యంలో గ్రాన్యూల్స్ షేరు ధర శుక్రవారం 4.20 శాతం అధికమై రూ.375.75 వద్ద స్థిరపడింది. -
ఎల్అండ్టీ ఫైనాన్స్‌లో 10% వాటా బెయిన్ క్యాపిటల్‌కు
ముంబై: ఎల్ అండ్ టీ అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌లో 10.2% వాటాను అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ రూ.1,310 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపు, మార్కెట్ లావాదేవీలతో ఈ కొనుగోలు జరిగింది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ 5.27% వాటాను(9.5 కోట్ల షేర్లను) రూ.707.9 కోట్లకు, మాతృసంస్థ ఎల్ అండ్ టీ 4.95 శాతం వాటాను(8.5 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.70కు) రూ.602 కోట్లకు బెయిన్ క్యాపిటల్‌కు విక్రయించాయి. సిటీ గ్రూప్ సంస్థ కస్డోడియన్గా వ్యవహరించిన ఈ లావాదేవీకి వాటాదారుల, సంబంధిత సంస్థల ఆమోదం పొందాల్సి ఉంది.