
హైదరాబాద్: స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను విస్తరించే వ్యూహంలో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బైన్ క్యాపిటల్ హైదరాబాద్‌కు చెందిన పోరస్ లేబొరేటరీస్‌ను కొనుగోలు చేసింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడించలేదు. అయితే ఒప్పందం విలువ దాదాపు రూ.2,500–రూ3,000 కోట్లు (302–363 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా.
2021–22 ఆర్థిక సంవత్సరంలో పోరస్ నికర విక్రయాల విలువ రూ.807 కోట్లు. 2020–21తో పోల్చితే (678 కోట్లు) 19 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. స్థూలంగా ఆదాయాలు ఇదే కాలంలో 97 శాతం వృద్ధితో రూ.123 కోట్ల నుంచి రూ.242 కోట్లకు ఎగసింది. 1994లో ఎన్. పురుషోత్తమ రావు స్థాపించిన పోరస్.. స్పెషాలిటీ పాలిమర్‌లు, ఎలక్ట్రానిక్ రసాయనాలు, ఆగ్రోకెమికల్స్‌తో పాటు ఇతర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment