investment portfolio
-
మల్టీ-అసెట్ ఫండ్స్‌తో దీపావళి కాంతులు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఒక్క చోట చేరి సంతోషంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళి. సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి పూజ ఈ వేడుకల్లో కీలకమైనది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా, సంపదను సాధించాలన్నా మనం కూడా కష్టపడి పనిచేయాలి. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. లక్ష్మీ దేవి పూజలో ఉపయోగించే దీపాలు, పూలు, నగదు మొదలైన వాటిని ఒకసారి పరిశీలిస్తే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ప్రేరణనిచ్చే అంశాలెన్నింటినో తెలుసుకోవచ్చు. వివిధ పూజాద్రవ్యాల సమాహారంలాగా ఈక్విటీ, డెట్, గోల్డ్ మొదలైన వాటితో కూడు కున్న మల్టీ అసెట్ ఫండ్ అనేది మెరుగైన రాబడులను పొందడంలో ఇన్వెస్టర్లకు ఎంతగానో తోడ్పడుతుంది.దీపాలు: ఈక్విటీల కాంతులు చీకటిని పారద్రోలి, ఆశల కాంతులనిస్తాయి దీపాలు. మొత్తం పూజా కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించేలా వెలుగు పంచుతాయి. మల్టీ–అసెట్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈక్విటీ పెట్టుబడులు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. సాధారణంగా పోర్ట్‌ఫోలియోకు వృద్ధి చోదకాలుగా ఈక్విటీలు పనిచేస్తాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడతాయి. దీపాలు ఏ విధంగానైతే గదిని కాంతివంతం చేస్తాయో దీర్ఘకాలంలో అధిక రాబడులను అందించి వృద్ధి దిశగా సాగే బాటను ప్రకాశింపచేస్తాయి ఈక్విటీలు. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వీటితో కొన్ని రిస్కులు ఉన్నప్పటికీ సంపద సృష్టి విషయంలో వీటికున్న సామర్థ్యాల కారణంగా సమతుల్యమైన పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా చోటు కల్పించాల్సిన ఆర్థిక సాధనంగా ఈక్విటీలు ఉంటాయి. పుష్పాలు: డెట్ సాధనాల సౌరభాలు లక్ష్మీ పూజలో స్వచ్ఛత, అందానికి చిహ్నమైన పుష్పాలు కూడా కీలకమే. పరిమళాలు వెదజల్లే పుష్పాలు పూజా కార్యక్రమానికి ఒకవైపు రంగుల హంగులను జోడిస్తూ మరోవైపు ఆధ్యాత్మిక శోభను తెస్తాయి. మల్టీ అసెట్ ఫండ్‌లో బాండ్లు, డిబెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీల్లాంటి డెట్ సాధనాలు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. మల్టీ అసెట్ ఫండ్‌లో డెట్ సాధనాలు స్థిరత్వాన్ని, క్రమానుగత ఆదాయాన్ని అందిస్తాయి. ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనైనా పోర్ట్‌ఫోలియో తీవ్ర ఒడిదుడుకులకు లోను కాకుండా సమతూకంగా ఉండేలా డెట్ సాధనాలు కాస్త బఫర్‌గా పనిచేస్తాయి. ఇవి మరో అంచె భద్రతను కల్పిస్తాయి. మార్కెట్ అనిశ్చితిని అధిగమించే ధీమాను అందిస్తాయి. తిలకం: రక్షణ కవచం నుదుటిపైన బొట్టు/తిలకం శుభాన్ని, రక్షణను సూచిస్తుంది. ప్రతికూల శక్తుల నుంచి భక్తులకు ఇది రక్షణ కల్పిస్తుంది. మల్టీ–అసెట్ ఫండ్‌లో ఈ పాత్రను పసిడి పోషిస్తుంది. సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పతనాలకు హెడ్జింగ్‌గా ఉపయోగపడే సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. రక్షణ కల్పించే తిలకంలాగే బంగారం కూడా ఆర్థిక సంక్షోభాల సమయంలో మీ పోర్ట్‌ఫోలియోను సురక్షితంగా ఉంచుతుంది. తమ సంపదను కాపాడుకోవాలనుకునే ఇన్వెస్టర్లు .. కాలం గడిచినా విలువను కోల్పోని బంగారాన్ని తమ పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా చేర్చుకోతగిన సాధనం కాగలదు. ఇటీవలి కాలంలో చూస్తే బంగారం కూడా గణనీయంగా రాబడులు అందించింది. వివిధ అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పసిడికి డిమాండ్ మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. నాణేలు/డబ్బు: నగదు తత్సమానాలు నాణేలు, నోట్ల రూపంలో సంపద, సమృద్ధి, శ్రేయస్సు, ఆర్థిక సమృద్ధిని సూచించే నగదుకు కూడా లక్ష్మీ పూజలో ప్రాధాన్యం ఉంటుంది. లక్ష్మీ దేవి ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని, ఆశీర్వదిస్తుందని నమ్మకం. ఇన్వెస్టింగ్ ప్రపంచంలో టీఆర్ఈపీఎస్ (ట్రెజరీ బిల్స్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్), ట్రెజరీ బిల్లుల్లాంటివి నగదు తత్సమానమైనవి. ఇవి పోర్ట్‌ఫోలియోలో అంతర్గతంగా భద్రతా కవచంగా ఉపయోగపడతాయి. మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు స్థిరత్వాన్ని ఇస్తాయి. వివిధ పూజాద్రవ్యాలతో లక్ష్మీ పూజ ఎలాగైతే సంపూర్ణమవుతుందో వివిధ సాధనాలను తగు పాళ్లలో జోడించుకుంటే పోర్ట్‌ఫోలియో కూడా సంపూర్ణంగా, సమతూకంగా ఉంటుంది. ఈక్విటీ, డెట్, బంగారం, నగదు మేళవింపుగా ఉండే మల్టీ అసెట్ ఫండ్స్ అటువంటి ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు కల్పిస్తాయి. -
2024లో పెట్టుబడులకు దారేది..?
ఇన్వెస్టర్లు ఏడాదికోసారి తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను తప్పకుండా సమీక్షించు కోవాలి. అప్పుడే ఏ విభాగానికి ఏ మేరకు కేటాయింపులు చేయాలన్న స్పష్టత వస్తుంది. ఈక్విటీలు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వడ్డీ రేట్లు సైతం గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. క్యాపిటల్ మార్కెట్లపై ఈ ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్.. వీటిల్లో ఏ విభాగం పనితీరు ఎలా ఉంటుంది..? ఇది తెలిస్తే.. తమ పెట్టుబడుల్లో వేటికి ఎంత మేర ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిర్ణయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులను ఒడిసి పట్టుకోవచ్చు. అంతేకాదు, మార్కెట్ అస్థిరతలను తట్టుకునే విధంగా తమ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు. దీనిపై మార్కెట్ నిపుణుల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీ అవకాశాలు దీర్ఘకాలంలో ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయని తెలిసిందే. 2024 సైతం ఇందుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. ‘‘2024 పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నాం. అంతర్జాతీయ, దేశీయ ముఖచిత్రం మెరుగ్గా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధిలో ఉండడం, మానిటరీ పాలసీ రేట్ల విషయంలో సర్దుబాట్లు, ముడి చమురు ధరలు తగ్గడం ఇందుకు మద్దతునిస్తున్నాయి’’అని ఫండ్స్ ఇండియా సీఈవో గిరిరాజన్ మురుగన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి, ఆ తర్వాత పలు దేశాల మధ్య యుద్ధాలతో అంతర్జాతీయంగా ఏర్పడిన అవరోధాల నడుమ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ప్రదర్శించడాన్ని గమనించొచ్చు. ‘‘అంతర్జాతీయంగా వాణిజ్యం విషయంలో మారిన ప్రాధాన్యతలు భారత్‌కు అనుకూలించనున్నాయి. పలు రంగాల్లో భారత్ అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను పెంచుకోనుంది. ఒకవైపు సేవల ఎగుమతుల్లో బలంగా ఉన్నాం. మరోవైపు తయారీలోనూ బలమైన స్థానం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’’అని ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు కెన్నెత్ ఆండ్రడే పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్టర్లకు భారత్ ప్రాధాన్య ఎంపికగా ఉంటుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘భారత్ ఆర్థిక అంచనాలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ వృద్ధి అంచనా 2.7 శాతాన్ని భారత్ వృద్ధి అంచనాలు 6.5–7 అధిగమిస్తున్నాయి. భారత ప్రభుత్వం వైపు నుంచి పారదర్శక, స్థిరమైన, స్నేహపూర్వక పెట్టుబడుల విధానాలు ఈ వృద్ధికి బలాన్నిస్తున్నాయి. ఇవన్నీ ప్రపంచవేదికపై భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్వర్గధామంగా మారుస్తున్నాయి’’అని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమన్ వీర్ తెలిపారు. ఈక్విటీల్లోనూ మెరుగైన రాబడుల అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? అన్న సందేహం వస్తుంది. కేంద్ర సర్కారు దేశీ తయారీ బలోపేతంపై విరామం లేకుండా కృషి చేస్తోంది. కనుక తయారీ రంగం 2024లోనూ బలమైన పనితీరు చూపించనుంది. 2024 సంవత్సరం మధ్య నుంచి వడ్డీ రేట్ల కోత మొదలవుతుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత భారత మార్కెట్లకు మరింత బూస్ట్నిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘‘వడ్డీ రేట్ల కోతతో విదేశీ ఇనిస్టిట్యూషన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా భారత్‌కు తరలివస్తాయి. దీంతో తయారీ, ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, డిఫెన్స్, రైల్వే ఇన్ఫ్రా, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీలు లాభపడనున్నాయి’’అని మురుగన్ వివరించారు. దేశీయ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తుంటే.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలు, సూచీల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆండ్రడే తెలిపారు. ‘‘ఈ ఏడాది డిఫెన్స్, రియాలిటీ, ఆటో, ప్రభుత్వరంగ, ఫార్మా కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. నూతనతరం (న్యూఏజ్) వ్యాపార కంపెనీలు అయితే డార్క్‌హార్స్‌గా నిలుస్తాయి. ఫైనాన్షియల్స్, ఐటీ, తయారీ, ప్రభుత్వరంగ సంస్థలు, హెల్త్‌కేర్ థీమ్‌లు సైతం ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతాయి’’ అని రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్ సీఐవో జ్రస్పీత్ సింగ్ అరోరా అభిప్రాయపడ్డారు. 2022 ఈక్విటీలకు అనుకూలంగా లేని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 2022, 2023 రెండు సంవత్సరాలకు కలిపి చూస్తే సెన్సెక్స్ ఇచి్చన నికర వార్షిక రాబడి 11.5 శాతమే. మార్కెట్ల వ్యాల్యూషన్లు కొంచెం గరిష్ట స్థాయికి చేరినందున ఇన్వెస్టర్లు వైవిధ్యంతో అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మిడ్, లార్జ్‌క్యాప్ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, అధిక రుణభారంతో నడిచే కంపెనీలకు దూరంగా ఉండాలని మురుగన్ సూచించారు. రియల్ ఎస్టేట్ దశాబ్ద కాలం పాటు రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ పెద్దగా పెరగలేదు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి డిమాండ్ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. వచ్చే ఐదు, పదేళ్ల పాటు రియల్ ఎస్టేట్ మెరుగైన పనితీరు చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నిపుణులు, విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుకు అనుగుణంగా ఈ రంగంలోకి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ, భౌతిక రియల్ ఎస్టేట్ అన్నది భారీ పెట్టుబడికి సంబంధించిన అంశం. అధిక ఆర్జన కలిగిన వర్గానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ‘‘పెట్టుబడి పరంగా రియల్ ఎస్టేట్ అన్నది క్లిష్టమైన, లిక్విడిటీ పెద్దగా లేని సాధనం. వైవిధ్యం కోసం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకున్నా, రిస్‌్కలు కూడా లేకపోలేదు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’’అని హర్ష గెహ్లాట్ సూచించారు. వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అందుకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ అయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లను పరిశీలించొచ్చు. బంగారం దీర్ఘకాలంలో (10–15 ఏళ్లు అంతకంటే ఎక్కువ) బంగారం ద్రవ్యోల్బణానికి మించి రాబడులను ఇస్తున్నట్టు ఫండ్స్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. చారిత్రక గణాంకాలను పరిశీలించినా ఇదే విషయం తెలుస్తుంది. దీర్ఘకాలంలో బంగారంపై రాబడి ద్రవ్యోల్బణం కంటే 2–4 శాతం అధికంగా ఉంటోంది. స్వల్పకాలానికి ఇది అనుకూలమైన సాధనం కాదు. అదే పనిగా స్థిరమైన రాబడులను అన్ని కాలాల్లోనూ బంగారం నుంచి ఆశించరాదు. మధ్య మధ్యలో బంగారం కొన్నేళ్లపాటు ఎలాంటి రాబడులు లేకుండా కొనసాగుతందని చెప్పడానికి గత ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దీర్ఘకాలం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల్లో వైవిధ్యానికి తోడు, అనిశి్చత సమయాల్లో, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా ఉపకరిస్తుంది. ‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం ఇవన్నీ బంగారంలో పెట్టుబడికి బలమైన నేపథ్యాలుగా చూడొచ్చు. రాబడులు అధిక స్థాయిలో లేకపోయినా, మరే ఇతర సాధనంలో లేనంతగా పెట్టుబడుల భద్రతకు బంగారం భరోసానిస్తుంది. రిస్‌్కలను ఎదుర్కొనేందుకు వీలుగా పోర్ట్‌ఫోలియోలో కొంత మొత్తాన్ని బంగారానికి కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది’’అని ఫిన్‌ఎడ్జ్ సీఈవో హర్ష గెహ్లాట్ సూచించారు. బంగారానికి అనుకూలించే ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు సైతం బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. డాలర్ నుంచి వైవిధ్యం కోరుకోవడం కూడా బంగారానికి మద్దతునిచ్చే అంశం. సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి బంగారానికి డిమాండ్ ఉండడం 2023లో ధరలకు మద్దతునిచి్చందని, 2024లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. భారత్, చైనా బంగారం కొనుగోళ్లలో రెండు అతిపెద్ద దేశాలు కాగా, వీటి నుంచి ఈ ఏడాదీ కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మన దేశం బలమైన ఆర్థిక వృద్ధి నమోదు చేస్తున్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందన్న అంచనా కూడా ఉంది. అయితే బంగారానికి ఎంత శాతం పెట్టుబడి కేటాయించుకోవాలన్న సందేహం ఏర్పడొచ్చు. ‘‘పెట్టుబడులకు బంగారాన్ని వైవిధ్య సాధనంగా చూడొచ్చు. అదే సమయంలో బంగారంపై పరిమితికి మించి చేసే పెట్టుబడులతో ప్రతికూల ఉత్పాదకత కూడా ఎదురుకావచ్చు. కనుక ఇన్వెస్టర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతానికి మించకుండా బంగారానికి కేటాయించుకోవచ్చు’’అని నిపుణుల సూచన. వేటికి ఏ మేరకు.. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఒక్కో సాధనానికి ఎంత మేరకు కేటాయింపులు చేయాలన్నదీ కీలకమే. ఇన్వెస్టర్ వయసు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల కాల వ్యవధి, పెట్టుబడుల వెనుక ఉన్న లక్ష్యం ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణ నియమం ప్రకారం.. ఐదేళ్లు అంతకుమించి ఎక్కువ కాలం పాటు తన పెట్టుబడులు కొనసాగించే వెసులుబాటు ఉండి, అధికంగా వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈక్విటీ ఫండ్స్ మొదటి ఆప్షన్ అవుతుంది. ఫండ్స్ బలమైన నియంత్రణల మధ్య, తక్కువ వ్యయాలు, చక్కని వైవిధ్యంతో, తగినంత లిక్విడిటీతో, నిపుణుల ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయని, ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చని గెహ్లాట్ సూచించారు. రిస్క్ నివారణకు ఈక్విటీల్లో దీర్ఘకాలానికి సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఐదేళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేసే వారు ఈక్విటీలకు మొత్తం పెట్టుబడుల్లో 70–80% వరకు, డెట్‌కు 15–20% వరకు, బంగారానికి 5–10% మధ్య కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ పదేళ్లు అంతకుమించి అయితే ఈక్విటీలకు 80–90%, డెట్‌కు 5–10%, బంగారానికి 5–10% వరకు కేటాయించుకోవచ్చు. పదేళ్లకు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే 20% వరకు కేటాయింపులు చేసుకోవచ్చన్నది సూచన. అప్పుడు డెట్ కేటాయింపులను రియల్ ఎస్టేట్‌కు మళ్లించుకోవచ్చు. డెట్ సాధనాలు.. డెట్ (స్థిరాదాయ) విభాగంలో పెట్టుబడులకు ఈ ఏడాది అనుకూలమేనని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘2023–24 వృద్ధి అంచనాలను ఆర్బీఐ అర శాతం పెంచి 7 శాతం చేసింది. 2024లో కనీసం మూడు పర్యాయాలు రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడ్ సంకేతాలు ఇచి్చంది. వడ్డీ రేట్ల కోతతో బాండ్ ధరలు పెరుగుతాయి. ఇది బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి అనుకూలం’’అని రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్ సీఐవో జ్రస్పీత్ సింగ్ అరోరా పేర్కొన్నారు. ‘‘2024–25లో జీడీపీ 6 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదు చేస్తుంది. అదే కాలంలో సగటు ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చు. గడిచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం 6 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కనుక 2024–25 ద్వితీయ ఆరు నెలల్లో ఆర్బీఐ రేట్ల కోత చేపట్టొచ్చు. ఆ నిర్ణయం పదేళ్ల భారత ప్రభుత్వ బాండ్ల (ఐజీబీ)కు అనుకూలిస్తుంది. భారత ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లలో ఉన్న వారు రేట్ల కోత ప్రయోజనాలు పొందుతారు’’అని ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ సీఐవో దావల్ దలాల్ తెలిపారు. 10 ఏళ్ల ఐజీబీ ప్రస్తుతమున్న 7.17 స్థాయి నుంచి 2025 మార్చి నాటికి 6.75 శాతానికి దిగొస్తుందని దలాల్ అంచనా వేస్తున్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్టర్లు క్రమంగా వ్యవధి పెంచుకోవాలని, ఐజీబీలను జోడించుకోవాలని సూచించారు. స్వల్ప కాలానికి కార్పొరేట్ సంస్థలు షార్ట్‌డ్యురేషన్ బాండ్ల జారీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటిపై ఈల్డ్స్ పెరగొచ్చని.. ఇన్వెస్టర్లు దీర్ఘకాల బాండ్లలో ప్రస్తుతమున్న అధిక రేట్లపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారని దలాల్ అంచనా వేశారు. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం అన్ని రకాల డెట్ సాధనాలపై ఇప్పుడు కాల వ్యవధితో సంబంధం లేకుండా ఒకటే పన్ను విధానం ఉండడాన్ని మర్చిపోకూడదు. డెట్ సాధనాలపై వచ్చే ఆదాయం వ్యక్తుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారి ఆదాయ శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మెరుగైన రాబడులు ఇచ్చే డెట్ సాధనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. మీడియం డ్యురేషన్‌తో కూడిన డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఒకటి. వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నందున ఈ సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. ఎఫ్డీలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ సహజంగా తక్కువ. -
బెయిన్ క్యాపిటల్ చేతికి పోరస్ ల్యాబ్స్
హైదరాబాద్: స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను విస్తరించే వ్యూహంలో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బైన్ క్యాపిటల్ హైదరాబాద్‌కు చెందిన పోరస్ లేబొరేటరీస్‌ను కొనుగోలు చేసింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడించలేదు. అయితే ఒప్పందం విలువ దాదాపు రూ.2,500–రూ3,000 కోట్లు (302–363 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పోరస్ నికర విక్రయాల విలువ రూ.807 కోట్లు. 2020–21తో పోల్చితే (678 కోట్లు) 19 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. స్థూలంగా ఆదాయాలు ఇదే కాలంలో 97 శాతం వృద్ధితో రూ.123 కోట్ల నుంచి రూ.242 కోట్లకు ఎగసింది. 1994లో ఎన్. పురుషోత్తమ రావు స్థాపించిన పోరస్.. స్పెషాలిటీ పాలిమర్లు, ఎలక్ట్రానిక్ రసాయనాలు, ఆగ్రోకెమికల్స్తో పాటు ఇతర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఇన్వెస్టర్లూ.. వీటి సంగతి చూడరూ.!
ఏదైనా ఒక విభాగంలో పెట్టుబడిని లక్ష్యం, కాల వ్యవధి, రంగం పనితీరు ఇలా ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. పెట్టుబడిదారులు తమ లక్ష్యాలకు అనుకూలమైన ఉత్పత్తులపై దృష్టి సారించాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో పరిమిత రిస్క్‌తో పెట్టుబడులకు వీలు కల్పిస్తాయి. కనుక చక్కని ఏకైక పెట్టుబడి పరిష్కారంగా ఇవి పనిచేస్తాయి. తమ పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసే సాధనాలను ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకోవడం ద్వారానే గరిష్ట ప్రయోజనాన్ని సొంతం చేసుకోగలరు. విదేశీ పెట్టుబడులకు చోటు నూతన, వినూత్నమైన పెట్టుబడుల అవకాశాలు మన మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపైనా ఇన్వెస్టర్లు ఒకసారి దృష్టి సారించాలి. ముఖ్యంగా అధిక రిస్క్ తీసుకునే వారు విదేశీ పెట్టుబడులకు చోటివ్వాలి. వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో దీర్ధకాలంలో గణనీయమైన సంపదను సృష్టించుకోవచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ తదితర సాధనాల ద్వారా ఇన్వెస్టర్లు ఆయా అవకాశాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అత్యవసరాల కోసం పెట్టుబడి జీవితంలో దేన్నీ ఊహించలేమని కరోనా మహమ్మారి అతిపెద్ద పాఠం నేర్పించింది. ఈ తరహా పరిస్థితులను మనం ‘సన్నద్ధత’ ద్వారానే అధిగమించగలం. అందుకని అత్యవసర నిధిపై పెట్టుబడి పెట్టడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆ నిధిని వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం ఓవర్‌నైట్ ఫండ్, లిక్విడ్ ఫండ్, లో డ్యురేషన్ డెట్ ఫండ్స్, లేదా ఫ్లోటర్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. నాణ్యతకు ప్రాధాన్యం పెట్టుబడుల సాధనాల నాణ్యతపైనా దృష్టి పెట్టాలి. మంచి వ్యాల్యూషన్లు, దీర్ఘకాలంలో రాబడులను ఇచ్చే విధంగా పెట్టుబడులు ఉండాలి. ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నట్టు అన్ని కంపెనీలు లేదా అన్ని రంగాల్లో ఎప్పుడూ అదే మాదిరి ప్రదర్శన, రాబడులను ఉండవని తెలుసుకోవాలి. ప్రీమియం వ్యాల్యూషన్లతో ఎక్కువ కాలంపాటు కొనసాగలేవు. కనుక దీర్ఘకాల పెట్టుబడుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయాలి. నూతన సంవత్సరం ప్రారంభమైందని చెప్పి తమ పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఏర్పడకపోవచ్చు. కాకపోతే పునఃసమీక్ష అన్నది మంచి విధానం. భవిష్యత్తులో రాబడులను ఇచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో ఉందా, లేదా అన్నది సరిచూసుకోవడం ఇక్కడ కీలకమని గుర్తించాలి. రిస్క్ కొద్దీ రాబడులు అనుభవం ఉన్న పెట్టుబడిదారులు రిస్క్‌ను, రాబడులను అర్థం చేసుకోగలరు. కానీ, అవగాహన లేని ఇన్వెస్టర్లు ‘రిస్క్’ అంటే ఏంటో నష్టాల రూపంలో చూడాల్సి వస్తుంది. కనుక ఇన్వెస్టర్లు రిస్క్‌ను అర్థం చేసుకునేందుకు వారి పోర్ట్‌ఫోలియోను సూక్ష్మంగా విడదీసి చూడాలి. తమ అవసరాలకు అనుగుణంగా రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు)చేసుకోవాలి. రిస్క్‌కు అనుగుణంగా రాబడులను సర్దుబాటు చేసుకోవాలి. ప్యాసివ్ పెట్టుబడి అవకాశాలు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పట్ల భారతీయ ఇన్వెస్టర్లలోనూ క్రమంగా ఆదరణ పెరుగుతోంది. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ఇవి వీలు కల్పించడమే కాకుండా.. ఇండెక్స్‌కు అనుగుణంగా వెయిటేజీ, రాబడులకు చోటిస్తున్నాయి. ఫండ్ మేనేజర్ వైపు నుంచి పక్షపాత ఆధారిత లోపాలను అధిగమించే ఉత్పత్తులు ఇవి. ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ రూపంలో ప్యాసివ్ పెట్టుబడులు చేసుకోవచ్చు. ఇండెక్స్కే పరిమితం అయ్యే ఉత్పత్తులు ఇవి ఎంతమాత్రం కాబోవు. థీమ్యాటిక్, రంగాల వారీ ఫండ్స్‌లోనూ ఇవి అంకురిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు రాబడులపై భరోసా ఉంటుంది. లక్ష్యాల సమీక్ష గడిచిన రెండేళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయి. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. కనుక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల లక్ష్యాలను కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా సమీక్షించుకోవాలి. వివాహం తర్వాత బాధ్యత పెరిగి రీబ్యాలన్స్ అవసరం ఏర్పడవచ్చు. లేదంటే ఉన్నత విద్యకు సంబంధించిన ప్రాధాన్యతలు మారిపోయి ఉండొచ్చు. వీటికి అనుగుణంగా మీ పెట్టుబడుల లక్ష్యాల్లోనూ మార్పులు చేసుకోవాలి. మార్కెట్లో నూతన అవకాశాల కోసం చూస్తూ ఉండొచ్చు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియో నిర్మాణంపై తప్పకుండా దృష్టి సారించాలి. గడిచిన రెండేళ్లలో.. ముఖ్యంగా కరోనా ప్రవేశం తర్వాత ప్రతీ ఒక్కరికీ ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వ్యాపార విధానాలు, నమూనాలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీని అక్కున చేర్చుకోవాల్సి వచ్చింది. నూతనతరం టెక్నాలజీ ఆధారిత కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల వైఖరిలోనూ మార్పు వచ్చింది. 2022 అయినా స్థిరత్వాన్ని, సానుకూల పరిస్థితులను తీసుకురావాలని ఆశిద్దాం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్) చేయించుకోవాలన్నది వైద్యుల సూచన. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను నిర్ణీత కాలానికోసారి సమీక్షించుకోవాలన్నది (వెల్త్ చెక్) ఆర్థిక సలహాదారులు ఇచ్చే సలహా. నూతన సంవత్సరం ఆరంభం ఇందుకు అనుకూల సందర్భంగా చూడాలి. గత సంవత్సరంలో రాబడులు ఏ మేరకు సమకూరాయి, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల తీరు వీటన్నింటినీ పరిశీలించుకుని అస్సెట్ అలోకేషన్‌ను అమల్లో పెట్టాలి. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకునే విధంగా విధానాన్ని రూపొందించుకుని అమల్లో పెట్టాలి. – రాఘవ్ అయ్యంగార్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యాక్సిస్ ఏఎంసీ -
జీవిత బీమా కూడా పెట్టుబడి సాధనమే!
పనిచేసే మహిళలకు తప్పనిసరి అవసరం జీవిత బీమా ను ప్రతిఒక్కరూ ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవాలి. ముందుగా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉండటం సహా పలు ఇతర ప్రయోజనాలుంటాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువ. ఈ విషయం మహిళలకు తెలియనిదేమీ కాదు. అయినా వారు జీవిత బీమా పాలసీని వారి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా చూడటం లేదు. ఎందుకో తెలుసా?!! ఎందుకో తెలుసుకోవాలంటే... అంతకన్నా ముందు మహిళలు జీవిత బీమా ఎందుకు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఊహించని ప్రమాదం జరిగి మరణించడం, వికలాంగులుగా మారటం వంటివి జరిగితే.. కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసమే ఎవరైనా పాలసీకి ప్రాధాన్యమిస్తారు. చాలామంది ఆ బాధ్యత భర్తది అనుకుంటారు కనుక తమకెందుకులే జీవిత బీమా అనుకుంటారు. ఒకవేళ పనిచేసే మహిళ ఒంటరి అనుకోండి. ఆమె తన తల్లిదండ్రుల కోసం, తనపై ఆధారపడ్డ ఇతర కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం పాలసీ తీసుకోవాలి. ఒకవేళ పనిచేసే మహిళకు పిల్లలుంటే... వారి చదువుని దృష్టిలో ఉంచుకొని పాలసీవైపు మొగ్గు చూపాలి. ఇలా పలు రకాల అంశాలు మహిళలు జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో కీలకపాత్ర వహిస్తాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తోన్న మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎందుకని దాన్ని ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా చూడకూడదు? చూడాలి. చూడకపోవడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒక యుక్త వయసు మహిళ ఉన్నారనుకోండి. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే. ఇక ఆమెపై ఆధారపడి జీవించే వారు ఎవ్వరూ లేరు. స్వతంత్రురాలు. అలాంటపుడు ఆమెకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనిపించకపోవచ్చు. చావు గురించి ఆలోచించడం ఇష్టంలేకపోవడం సహా పాలసీ తీసుకోవడం వల్ల తక్షణం లేదా జీవిత కాలం మొత్తంలో వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదనే ఆలోచన వల్ల కూడా చాలా మంది యుక్త వయసు మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం లేదన్నది వాస్తవం. పాలసీ తీసుకోవడానికి ఎక్కువ డబ్బు అవసరమనే అపోహ, పాలసీ గురించి సమగ్రంగా తెలియకపోవడం, ఆరోగ్యంగా ఉన్నామని భావించడం వంటి విషయాలు కూడా మహిళలు పాలసీకి దూరంగా ఉండటానికి కారణాలుగా ఉన్నాయి. ఇక మరికొందరైతే వారి వయసు వారు పాలసీ తీసుకోలేదని వీరు కూడా వాటికి దూరంగా ఉంటున్నారు. నా సలహా ఏమిటంటే... ఇలాంటి అపోహలేవీ పెట్టుకోవద్దు. పాలసీ తీసుకోవడానికి మీ సంపాదన సరిపోతుంది. వేచి ఉండకండి. ఇన్వెస్టర్లతో, కుటుంబ స్నేహితులతో, సహోద్యోగులతో మాట్లాడండి. ఎంత వీలైతే అంత త్వరగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సుబ్రత మొహంతి మార్కెటింగ్ హెడ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ -
ప్రైవేటు డబ్బు రంగ ప్రవేశం!
కాదేదీ ప్రైవేటైజేషన్‌కు అనర్హం అన్నట్టుగా ప్రజోపయోగ సర్వీసుల నుంచి శాంతి భద్రత లు, దేశ రక్షణ సైతం ప్రభుత్వాలు ప్రైవేటీకరిస్తున్నాయి. మరి డబ్బును ప్రైవేటీకరణ చేసేది ఎన్నడు? ఆ రోజులూ వచ్చేశాయి. అయితే ఆ పని ఏ ప్రభుత్వమూ చేయదుగాక చేయదు. అయినా ప్రైవేటు డబ్బు... ‘బిట్‌కాయిన్స్’ రూపంలో పుట్టుకొచ్చింది. ఆగస్టు మూడో వారంలో జర్మనీ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ‘బిట్‌కాయిన్స్’ను చట్టబద్ధమైన చెల్లింపుల సాధనంగా గుర్తించింది. ఎవరి గుర్తింపులూ అవసరం లేకున్నా ముందే ఇంటర్నెట్ డబ్బుగా బిట్కాయిన్లు చలామణిలోకి వచ్చేశాయి. సరిహద్దులు, ఆంక్షలు లేని స్వతంత్ర, స్వేచ్ఛా ప్రపంచ స్వాప్నికుల సృష్టి ఈ కాయిన్స్. ‘సరిహద్దులు లేని ప్రపం చం’, ‘కేంద్ర బ్యాంకు ప్రమేయంలేని డబ్బు’ లక్ష్యాలతో ఏర్పడ్డ బిట్కాయిన్లను ఏ దేశ కేంద్ర బ్యాంకు జారీ చేయదు. అది పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితమైన ఎలక్ట్రానిక్ డబ్బు. 2009లో వాటిని ప్రవేశపెట్టినప్పుడు ఒక్కో బిట్‌కాయిన్ విలువ ఐదు సెంట్లు మాత్రమే. నాలుగేళ్లు తిరిగేసరికి నేడు ఒక్కోదాని విలువ 120 డాలరు!్ల ప్రత్యేకి ంచి యూరో సంక్షోభం నేపథ్యంలో బిట్కాయిన్లను విస్తృతంగా విని యోగిస్తున్నారు. ఈ డబ్బుతో సాగే లావాదేవీలు పన్నుల వాతలకు అందేవి కావు. దీంతో మొదట్లో నెట్ గేమింగ్‌కు మాత్రమే పరిమితమైన బిట్‌కాయిన్స్ షాపులకు, రెస్టారెంట్లకు విస్తరించాయి. మన దేశంలో బంగారాన్ని సురక్షిత మదుపుగా భావిస్తున్నట్టుగా కొన్ని యూరప్ దేశాల్లో బిట్‌కాయిన్స్‌ను ‘కొంటున్నారు’. మార్కెట్ భాషలో చెప్పాలంటే పోర్ట్ ఫోలియో పెట్టుబడులుగా పెడుతున్నారు. అమెరికా, యూరప్లకేగాక ఆసియాకు కూడా విస్తరిస్తున్న బిట్కాయిన్లను ఏ సూత్రాలతో లొంగదీయాలనేది అంతుబట్టక విధానకర్తలు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి బిట్‌కాయిన్స్ ఏ దేశ కరెన్సీ తలరాతను మార్చగలిగే స్థితికి చేరలేదు. అయినా అది దేశాల సార్వభౌమత్వాల ఉల్లంఘన కిందకు వస్తుందేమోనన్న చింత ప్రభుత్వాలది. ఎవరి చింత ఎలా ఉన్నాబిట్కాయిన్స్ ఇంటర్నెట్ నుంచి నిజ ప్రపంచంలోకి కూడా ప్రవేశించాయి. ప్రపంచవ్యాప్తంగా 7,500 సుప్రసిద్ధ షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్లలో వాటిని స్వీకరిస్తున్నారు. డబ్బులు, క్రెడిట్ కార్డులు లేకుండానే దర్జాగా షాపింగ్‌లు చేసే రోజులు వచ్చేస్తున్నాయని కొందరు అత్యాశావహులైన స్వాప్నికులు అంటున్నారు. 2008లో సతోషి నకామోటో అనే కల్పిత వ్యక్తి పేరిట మొదటిసారిగా బిట్కాయిన్ల ప్రతిపాదన ప్రపంచం ముందుకు వచ్చింది. ఎవరూ పెద్దగా పట్టించుకోకముందే 2009 జనవరి 3న బిట్కాయిన్ల ‘మైనింగ్’ (గనుల తవ్వకం) మొదలైంది. ఈ గనులు నిజానికి ఇంటర్నెట్ సర్వర్లు మాత్రమే. ఆ సర్వర్లు ప్రతి బిట్‌కాయిన్‌కు సంకేతంగా ఒక విలక్షణమైన నంబర్‌ను సృష్టిస్తాయి. 33 అంకెలు, అక్షరాలతో కూడిన ఆ నంబర్‌ను కలిగి ఉండటమం టే ఒక బిట్‌కాయిన్ ఉండటం. అంటే బిట్‌కాయిన్ ఒక నంబర్ మాత్రమే. ఆ నంబర్లను గుర్తుపెట్టుకోనవసరం లేదు. మన అకౌంట్లో అవి ఉంటాయి. డూప్లికేట్లకు తావు లేనే లేదని విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. ఒక ఖాతాదారునికి మరో ఖాతాదారునికి మధ్య లావాదేవీలు జరుగుతాయి. ఏదైనా వస్తువును 500 డాలర్లకు కొంటే దానికి సరిపడా తమ అకౌంట్లో డిజిటల్ సంతకం చేస్తే చాలు ఆ ఖాతాలోంచి అవి అమ్మకందారు ఖాతాలోకి చేరిపోతాయి. అకౌంట్లను, లెడ్జర్లను పకడ్బంది క్రిప్టోగ్రఫీ (నిగూఢ లిపి) ద్వారా నిర్వహిస్తారు. ఖాతాదార్ల డిజిటల్ సంతకాలను దొంగిలిస్తే తప్ప మోసాలకు తావు లేదు. బిట్కాయిన్లు మాత్రమే ఏకైక ఇంటర్ నెట్ డబ్బుగా చలామణి కావాలనేది ఈ స్వాప్నికుల లక్ష్యాలకే విరుద్ధం. అంతేగాక కేంద్ర బ్యాంకులు కరెన్సీని ఎక్కువగా ముద్రించి, విలువ తగ్గిన కరెన్సీతో ప్రజల జేబులకు చిల్లులు వేయడానికి వ్యతిరేకంగా ఈ డబ్బును సృష్టించామని వాళ్లు అంటున్నారు. 2140 నాటికి 2.10 కోట్ల బిట్కాయిన్లు మాత్రమే మైనింగ్ అవుతాయి. ఆ తర్వాత కొత్తవి తయారుకావు. నాలుగేళ్లకు ఒకసారి అంతకు ముందటి ఏడాది విడుదలైన నాణేల్లో సగమే విడుదలయ్యేట్టుగా ఉత్పత్తిని నియంత్రించారు. అందుకే బిట్కాయిన్లను పెద్దగా పట్టించుకోనవసరం లేదని కొందరి వాదన. ఎవరి వాదనలు, విమర్శలు ఎలా ఉన్నా బిట్‌కాయిన్ డబ్బు మౌలిక స్వభావాన్ని వెల్లడిస్తోంది. నమ్మకం డబ్బుకు మూలం. రూపాయిని డబ్బుగా నమ్ముతున్నాం కాబట్టే డబ్బు. నమ్మకం పోతే అది వెయ్యి రూపాయలే అయినా అర్థంపర్థంలేని కొన్ని నంబర్లున్న చితు ్తకాగితం. డబ్బు మీద నమ్మకం అంటే డబ్బుకు ఉన్న కొనుగోలుశక్తి మీద ఉన్న నమ్మకమే. అదే నిజం. డబ్బు మీద నమ్మకం పోవడమంటే దాన్ని జారీ చేసే ప్రభుత్వం మీద నమ్మకం పోవడమే. వంద రూపాయల నోటుకు సంచి నిండా కూరగాయలు కొనుక్కున్న ఇల్లాలి సంచి బరువు తగ్గుతుండటమంటే ప్రభుత్వం పరువు తగ్గుతుండటమే. యూరోతోపాటూ ఆ దేశాల ప్రభుత్వాలు కూడా పరువు పోగొట్టుకుంటున్నాయి కాబట్టే బిట్‌కాయిన్ జోష్ సాగుతోందనేది మాత్రం తిరుగులేని వాస్తవం. -పిళ్లా వెంకటేశ్వరరావు